కమిటైతే ప్రాణం పెడతా, ప్రభాస్‌ను అన్నయ్యా అనలేను: అనుష్క సంచలనం!

By Bojja Kumar

Recommended Video

కమిటైతే ప్రాణం పెడతా..కానీ.. ప్రభాస్‌ను అన్నయ్యా అనలేను..!

బాహుబలి స్టార్ ప్రభాస్, సౌతిండియా స్టార్ హీరోయిన్ అనుష్క మధ్య లవ్ ఎఫైర్ ఉందని, త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని తరచూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుష్క ప్రభాస్ గురించి చేసిన ఓ కామెంట్ హాట్ టాపిక్ అయింది.

 అనుష్కను వెంటాడుతున్న ప్రభాస్

అనుష్కను వెంటాడుతున్న ప్రభాస్

అనుష్క ఎక్కడికెళ్లినా ప్రభాస్ గురించిన ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అనుష్క‘భాగమతి' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదలవుతున్న నేపథ్యంలో అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలో పాల్గొనగా ప్రభాస్ ప్రస్తావన, పెళ్లి ప్రస్తావన వచ్చింది.

పెళ్లి గురించి

పెళ్లి గురించి

తాను ఎక్కడికెళ్లినా పెళ్లి గురించి ప్రస్తావన వస్తోందని,ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి అడుగుతున్నారని అనుష్క తెలిపారు.నేనైతే పెళ్లి గురించి ఆలోచించడమే మానేశాను.... అని అనుష్క వెల్లడించారు.

 అబ్బాయిని వెతికి పెట్టండి

అబ్బాయిని వెతికి పెట్టండి

మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? వయసు పైబడుతోంది కదా.... ఇంకా ఎన్ని రోజులు ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటారు? అనే ప్రశ్నకు అనుష్క ఆసక్తికరంగా స్పందించారు. ‘నాకోసం మీరే ఓ మంచి అబ్బాయిని వెతికిపెట్టండి' అంటూ ఎదురు ప్రశ్నించారు.

 ప్రభాస్‌తో రిలేషన్ గురించి

ప్రభాస్‌తో రిలేషన్ గురించి

ప్రభాస్‌ నాకు కేవలం మంచి మిత్రుడు మాత్రమే. అంతకు మించి మా మధ్య ఏమీ లేదు. ఇద్దరూ కలిసి వరుస సినిమాలకు పని చేయడం వల్ల ఇద్దరి మధ్య స్నేహం బలపడిందని అనుష్క చెప్పుకొచ్చారు.

 అన్నయ్యా అని పిలవలేను

అన్నయ్యా అని పిలవలేను

ప్రభాస్‌ను నేను అన్నయ్య అని పిలవనేను. అందరు అబ్బాయిల్నీ మనం అన్నయ్యగా భావించలేం కదా? అంటూ..... ఓ ప్రశ్నకు అనుష్క రిప్లై ఇచ్చారు. అనుష్క ఇలా రిప్లై ఇవ్వడం మీడియాలో సంచలనం అయింది.

 భాగమతి సినిమా గురించి

భాగమతి సినిమా గురించి

‘భాగమతి' చిత్రంలో నేను సంచల అనే ఐఏఎస్‌ అధికారిణి పాత్రలో నటిస్తున్నాను. ఓ ఐఏఎస్‌ అధికారిణి ‘భాగమతి'గా ఎలా మారింది? అన్నదే ఈ సినిమా కథ... అని అనుష్క వెల్లడించారు.

ఐదేళ్ల క్రితమే కథ చెప్పాడు

ఐదేళ్ల క్రితమే కథ చెప్పాడు

దర్శకుడు అశోక్‌ ఈ సినిమా కథను 2012లోనే చెప్పారు. కానీ అప్పటికే నేను ‘లింగా', ‘సైజ్‌ జీరో', ‘బాహుబలి 1', ‘బాహుబలి 2' సినిమాలతో బిజీగా ఉండటం వల్లే చేయలేక పోయాను అని అనుష్క వెల్లడించారు.

 భాగమతి అలాంటి కథ కాదు

భాగమతి అలాంటి కథ కాదు

భాగమతి మూవీ కల్పిత కథ మాత్రమే, భాగమతి చరిత్రకు, దీనికి ఎలాంటి సంబంధం లేదు. స్క్రిప్టు నచ్చడంతో పాటు, యూవీ క్రియేషన్స్‌ వారి నిర్మాణం వల్లే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను అని అనుష్క తెలిపారు.

 కమిటైతే ప్రాణం పెడతా

కమిటైతే ప్రాణం పెడతా

నాకు స్క్రిప్టు బాగా నచ్చితేనే చేయడానికి ఒప్పుకుంటాను. ఏదైనా సినిమాకు కమిటైతే ప్రాణం పెట్టి చేస్తాను. ‘సైజ్‌ జీరో' కోసం చాలా బరువు పెరిగిపోయాను. తర్వాత ఇతర సినిమాల కోసం బరువు తగ్గాను.... అని అనుష్క తెలిపారు.

 రొమాంటిక్ సినిమాలు చేయడమే ఇష్టం

రొమాంటిక్ సినిమాలు చేయడమే ఇష్టం

కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేయడానికి ప్రత్యేకంగా కారణం ఏమీ లేదు. కంటెంటు కొత్తగా ఉండి, కథ నచ్చితే ఒప్పుకుంటాను. రొమాంటిక్‌ సినిమాలూ చేయాలని ఉంది. థ్రిల్లర్‌ సినిమాలు నాకు అంతగా నచ్చవు. కానీ అలాంటి సినిమానే ఒప్పుకున్నా. ‘అరుంధతి' సినిమాకు శ్యాంప్రసాద్ రెడ్డి నన్ను ఎంపికచేసుకోబట్టే ఈరోజు ఈ తరహా సినిమాలు చేయగలుగుతున్నాను అని అనుష్క తెలిపారు.

 పూరి జగన్నాథ్ నేర్పించారు

పూరి జగన్నాథ్ నేర్పించారు

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సినిమా ఒప్పుకునే ముందు స్క్రిప్ట్‌ వినాలా? వద్దా? అన్న విషయాలు కూడా తెలీవు. నేను తొలిసారి సూపర్ సినిమాకు పూరీ జగన్నాథ్‌ గారితో పని చేశాను. ఆయనే నాకు ఇవన్నీ నేర్పించారు అని అనుష్క వెల్లడించారు.

 ఏ విషయం గురించీ ఎక్కువగా ఆలోచించను

ఏ విషయం గురించీ ఎక్కువగా ఆలోచించను

జీవితంలో ఏ విషయం గురించీ ఎక్కువగా ఆలోచించను. అన్నీ వాటంతటవే జరిగిపోతున్నాయి. అందుకే పెళ్లి గురించి కూడా ఆలోచించడం లేదు.... అని అనుష్క తెలిపారు.

 రాజమౌళితో మళ్లీ చేయాలని ఉంది

రాజమౌళితో మళ్లీ చేయాలని ఉంది

రాజమౌళి గారు ప్రతిభ ఉన్న డైరెక్టర్. అలాంటి దర్శకుడితో మళ్లీ మళ్లీ చేయాలని అందరూ కోరుకుంటారు. నేను కూడా అలాంటి వారిలో ఒకరిని అని అనుష్క తెలిపారు.

 నెక్ట్స్ మూవీ ఎవరితో

నెక్ట్స్ మూవీ ఎవరితో

త్వరలో గౌతమ్‌ మేనన్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాను. త్వరలోనే అందుకు సంబంధించి వివరాలు వెల్లడిస్తాను అని అనుష్క తెలిపారు. ఉంది.'

వాటిని పట్టించుకోను

వాటిని పట్టించుకోను

నా పెళ్లి గురించి, ఇతర విషయాల గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయని కొందరు చెబితే విన్నాను. వాస్తవానికి నేను అసలు వార్తలు చదవను. ఒక వేళ నా దృష్టికి వచ్చినా పట్టించుకోను అని అనుష్క తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X