»   » తమన్నా పవర్ కూడా పని చేయలేదు: పెళ్లిపై ప్రభాస్ షాకింగ్ స్టేట్మెంట్

తమన్నా పవర్ కూడా పని చేయలేదు: పెళ్లిపై ప్రభాస్ షాకింగ్ స్టేట్మెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఆయన పెళ్లి విషయంలో చాలా టెన్షన్ గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ వయసు 40కి రెండు అడుగుల దూరంలో మాత్రమే ఉండటమే ఇందుకు కారణం. ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకుని సెటిలవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

నిన్న మొన్నటి వరకు బాహుబలి సినిమా తర్వాత తన పెళ్లి అంటూ..... చెప్పుకూంటూ వచ్చిన ప్రభాస్ తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మ్యారేజ్ గురించి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు.

పెళ్లి ఎప్పుడో తెలియదన్నప్రభాస్

పెళ్లి ఎప్పుడో తెలియదన్నప్రభాస్

ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటారా? అనే ప్రశ్నకు ప్రభాస్ స్పందిస్తూ ‘ఎవడికి తెలుసు? నా పెళ్లి ఎప్పుడో నాకే తెలియదు. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలియదు' అని సమాధానం చెప్పాడు.

నాపై తమన్నా పవర్ కూడా పని చేయలేదు

నాపై తమన్నా పవర్ కూడా పని చేయలేదు

మీరు పెళ్లి అనగానే రానా, నేను అనుకున్న జోక్ ఒకటి గుర్తొచ్చింది. తమన్నా ఎవరితో అయితే ఫస్ట్ టైం చేసిందో ఆయా స్టార్స్ అందరికీ నెక్ట్స్ ఇయర్ పెళ్లి అయిపోయింది. అలా తమిళంలో ఆర్టిస్టులకి, చరణ్ కి, అందరికీ అయింది.... కట్ చేస్తే నా ఒక్కడికే అవ్వలేదు. అంటే తమన్నా పవర్ కూడా నాపై పని చేయలేదు... తమన్నా నాతో రెండు సినిమాలు చేసింది.... పవర్ రివర్స్ అయి ఆమెకు పెళ్లి అవుతుందేమో అంటూ అంటూ ప్రభాస్ సరదాగా వ్యాఖ్యానించారు.

రెండేళ్ల తర్వాత అడగండి

రెండేళ్ల తర్వాత అడగండి

రానా మాట్లాడుతూ.... నాకు ఇప్పుడు అసలు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు. ఈ ప్రశ్న మరో రెండేళ్ల తర్వాత అడగండి అని రానా చెప్పుకొచ్చారు. పెళ్లి చేసుకునే సమయం లేదని, చాలా పనులు ఉన్నాయని రానా తెలిపారు.

పెళ్లి విషయంలో అనుష్క

పెళ్లి విషయంలో అనుష్క

అనుష్క స్పందిస్తూ.... ప్రభాస్, రానా మాదిరిగానే నా పెళ్లి విషయంలో కూడా ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు అని అనుస్క అన్నారు. పరిస్థితి చూస్తుంటే ముగ్గురు బ్రహ్మచారుల్లానే మిగిలి పోయేలా ఉన్నారు.

English summary
Prabhas, Anushka and Rana about marriage plans. “I am not in a hurry to marry. My parents are not forcing me to do anything as they always respect my decisions. So, it will happen when it has to,” says Rana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu