ప్రభాస్, అనుష్క మధ్య ఇరుక్కుని ఇబ్బంది పడ్డ తమన్నా, అసలు ఏం జరిగిందంటే..?

Recommended Video

Prabhas & Anushka Old Video Goes Viral || Filmibeat Telugu

ప్రభాస్, అనుష్క శెట్టి మధ్య లవ్ ఎఫైర్ ఉన్నట్లు అప్పటో జోరుగా ప్రచారం సాగింది. బాహుబలి ప్రాజెక్టు కోసం 5 ఏళ్ల పాటు కలిసి పని చేసిన ఈ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారని, ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించినట్లు, పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. తెరపై అద్భుతంగా ఆన్ స్క్రీన్ రొమాన్స్‌ పండించిన ఈ జంట నిజజీవితంలో కూడా ఏకం కావాలని అభిమానులు సైతం కోరుకున్నారు. అయితే మా మధ్య ప్రేమ బంధం లేదని, పెళ్లి వార్తలు నిజం కాదని అనుష్కతో పాటు ప్రభాస్ స్పష్టం చేయడంతో ఈ వార్తలకు తెరపడింది. తాజాగా అనుష్క, ప్రభాస్‌కు చెందిన ఓ పాత వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇద్దరి మధ్య కూర్చుని ఇబ్బంది పడ్డ తమన్నా

ఇద్దరి మధ్య కూర్చుని ఇబ్బంది పడ్డ తమన్నా

గతంలో బాహుబలి సినిమాకు సంబంధించి కేరళలో జరిగిన ప్రెస్ మీట్లో ప్రభాస్, అనుష్క, రాజమౌళి, తమన్నా పాల్గొన్నారు. అయితే ప్రభాస్, అనుష్క మధ్య కూర్చుని తమన్నా కాస్త ఇబ్బంది పడ్డ సందర్భం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఓల్డ్ వీడియో క్లిప్ మరోసారి ఈ జంట మధ్య ఏదో స్ట్రాంగ్ రిలేషన్ ఉందనే వార్తలకు మళ్లీ బీజం వేసింది.

ఏం జరిగిందంటే?

ఏం జరిగిందంటే?

సినిమా ప్రమోషన్లో భాగంగా కేరళలో రాజమౌళి మాట్లాడుతుండగా... క్లాప్స్ కొట్టాలని ప్రభాస్ అనుష్కకు చెప్పాలనుకున్నాడు. మధ్యలో తమన్నా ఉండటంతో ఆమె ద్వారా ఆ విషయం అనుష్కకు చేరవేయాలనుకున్నాడు. అయితే అనుష్క తాను చెప్పిన మాట వినకపోవడంతో ప్రభాస్ అసంతృప్తికి గురైనట్లు వీడియోలో కనిపిస్తోంది.

తమన్నా ఇరిటేషన్

ఈ ఇద్దరి మధ్య కూర్చున్న తమన్నా.... కాస్త ఇరిటేట్ అయినట్లు వీడియోలో స్పష్టమవుతోంది. నేను ఎలాంటి సందేశం మోసుకెళ్లను... నువ్వే డైరెక్టుగా చెప్పు అనే విధంగా తమన్నా వెనక్కి జరిగి కూర్చోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. మరి అప్పట్లో ప్రభాస్, అనుష్క మధ్య ఏం గొడవ జరిగిందో?

బాహుబలి

బాహుబలి

బాహుబలి ప్రాజెక్టు విషయానికొస్తే... రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ భారీ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. భారతీయ సినిమాను రూ. 1000 కోట్ల మార్కు దాటించిన తొలి చిత్రం ఇది. ఆర్కా మీడియా సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 1800 కోట్లు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X