‘ఆది పురుష్’ కాన్సెప్ట్ లీక్ చేసిన దర్శకుడు.. మొత్తానికి ఆ విషయం బయటపడింది!!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఈరోజు నిజంగానే నిద్ర పట్టదు. ఎవ్వరూ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చేశాడు. అది కూడా అదిరిపోయే లెవెల్‌లో. నేరుగా బాలీవుడ్ ప్రాజెక్ట్‌ను చేయబోతోన్నట్టు అది కూడా త్రీడీ టెక్నాలజీలో అత్యంత భారీ ఎత్తున నిర్మించబోతోన్నట్టు ప్రకటించారు. అది కూడా అత్యంత పవర్‌ఫుల్ టైటిల్‌తో ప్రభాస్ రాబోతోండటంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక తాజాగా నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్ మరింత రచ్చగా మారింది.

 ప్యాన్ ఇండియన్ స్టార్..

ప్యాన్ ఇండియన్ స్టార్..

బాహుబలి సినిమాలతో ప్రభాస్ ప్యాన్ ఇండియాగా ఎదిగిన తరువాత సాహో చిత్రం అంతగా వర్కౌట్ కాలేదు. అయినా సరే ప్రభాస్ మాత్రం అన్నీ ప్యాన్ ఇండియా చిత్రాలనే తెరకెక్కిస్తున్నాడు. రాబోయే రాథేశ్యామ్ చిత్రం కూడా ప్యాన్ ఇండియానే. ఆపై రాబోతోన్న నాగ్ అశ్విన్ చిత్రం అయితే ఏకంగా అంతర్జాతీయ చిత్రమని ప్రకటించేశాడు డైరెక్టర్.

మొదటిసారి బాలీవుడ్ డైరెక్టర్..

మొదటిసారి బాలీవుడ్ డైరెక్టర్..

ఇప్పటి వరకు ప్రభాస్ ప్యాన్ ఇండియా చిత్రాలు చేసినా కూడా అవి తెలుగు దర్శకులతోనే చేశాడు. సుజిత్, రాధాకృష్ణ, నాగ్ అశ్విన్ అంటూ లోకల్ వారితోనే చేస్తున్నాడు. మొదటిసారిగా బాలీవుడ్ డైరెక్టర్‌తో జత కట్టాడు. తానాజీ ఫేమ్ ఓం రావత్‌తో కలిసి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఆదిపురుష్‌గా ప్రభాస్..

ఆదిపురుష్‌గా ప్రభాస్..

ఇక నేటి ఉదయం రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇక ఆదిపురుష్ అంటూ టైటిల్ ప్రకటించడంతో రకరకాల రూమర్స్ వచ్చాయి. నారాయణుడిగా, విష్ణువుగా, శివుడిగా ప్రభాస్ నటిస్తున్నాడంటూ ఎవరికి తోచినట్టు వారు వార్తలు రాసుకొచ్చారు.

రాముడిగా ప్రభాస్..

రాముడిగా ప్రభాస్..

ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తున్నట్టు డైరెక్టర్ నాగ్ అశ్విన్ లీక్ చేసేశాడు. ఈ క్రమంలో నాగ్ అశ్విన్ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. రాముడి పాత్ర‌లో ప్ర‌భాస్ గారిని చూసేందుకు ఆస‌క్తిగా ఉన్నా. గ‌తంలో కొద్ది మంది మాత్ర‌మే వెండితెర‌పై రాముడి పాత్ర‌లో క‌నిపించారు. ఆదిపురుష్ చిత్రానికి శుభాకాంక్ష‌లు అంటూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశాడు.

Recommended Video

Telugu Cinema Paataku Praanam Nuvvu | Ravi Varma Potedar's Song On SPB
అదిరిన మోషన్ పోస్టర్..

అదిరిన మోషన్ పోస్టర్..

ఇక కాసేపటి క్రితం విడుదల చేసిన మోషన్ పోస్టర్ దుమ్ములేపుతోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, టైటిల్ పోస్టర్‌లోని రావణుని మాదిరిగా కనిపించే తలలు, ఆంజనేయుని భారీ ఆకారం అన్నీ వైరల్ అవుతున్నాయి. ఇది కచ్చితంగా ఓ చరిత్ర అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X