Baahubali కోసం స్పెషల్ బాహుబలి హలీం.. పాతబస్తీలో జక్కన్న హల్చల్!

బాహుబలి సినిమాలో ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన చేస్తున్న అన్ని సినిమాలు కూడా ప్లాన్ ఇండియా లెవల్లో విడుదలవుతున్నాయి. అయితే బాహుబలి విడుదలైన తర్వాత ఆ క్రేజ్ ని రకరకాల వ్యాపారాలలో కూడా వాడుకుంటున్నారు. అందులో భాగంగానే ఇది హలీమ్ సీజన్ కాబట్టి ఒక రెస్టారెంట్ వాళ్లు బాహుబలి హలీం అనే పేరుతో హలీం విక్రయాలు చేస్తుండగా ఆ విషయం తెలుసుకున్న ప్రభాస్ దానిని స్పెషల్గా చేయించుకుని మరీ టేస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

హలీం సీజన్

హలీం సీజన్

రంజాన్ మాసం అంటే ముస్లిం సోదరులందరికీ చాలా పవిత్రమైన మాసం.. ఈ మాసం అంతా కూడా వారు ఉపవాస దీక్ష చేస్తూ చాలా భక్తి శ్రద్ధలతో దేవుని ఉపాసన చేస్తూ ఉంటారు. అయితే ఉపవాస దీక్షలు చేస్తారు కాబట్టి వాళ్లకు వెనువెంటనే బలం చేకూర్చడం కోసం చాలా బలవర్ధకమైన ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. అందులో హలీం ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. కేవలం ముస్లింలు మాత్రమే కాక అనేక మంది హిందువులు కూడా ఈ సీజన్లో హలీం తీసుకుంటూ ఉంటారు.

హలీం తీసుకురావాలని

హలీం తీసుకురావాలని

అయితే ప్రభాస్ కి కూడా హలీం తినాలని అనిపించడంతో తనకు అత్యంత సన్నిహితులైన ఒక వ్యక్తికి హలీం తీసుకొచ్చే బాధ్యత అప్పగించారు.. సాధారణంగా హలీమ్ అనగానే చార్మినార్ దగ్గర దొరికే వివిధ హోటల్స్ కి సంబంధించిన హలీం గుర్తుకొస్తుంది. అయితే ప్రభాస్ మాత్రం బాహుబలి పేరుతో హలీమ్ ఏర్పాటు చేశారు అనే విషయం తెలుసుకుని ఆ రెస్టారెంట్ నుంచి హలీం తీసుకురావాలని చెప్పడంతో ప్రభాస్ స్నేహితుడు అదే రెస్టారెంట్ ద్వారా హలీమ్ తప్పించే ప్రయత్నం చేశారు.

బాహుబలి హలీం

బాహుబలి హలీం


ఈ విషయాన్ని అర్చన అనే ఒక సోషల్ మీడియా సెలబ్రిటీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. తనకు ప్రభాస్ సన్నిహితుడు హలీం కావాలని అది కూడా బాహుబలి హలీం కావాలని కోరడంతో గ్రిల్ 9 అనే రెస్టారెంట్ ఓనర్ ని బాహుబలి కోసం స్పెషల్ బాహుబలి చేయవలసిందిగా కోరానని చెప్పుకొచ్చింది. వెంటనే ఎగిరి గంతేసిన సదరు రెస్టారెంట్ ఓనర్ వెంటనే ప్రభాస్ కోసం ఒక అద్భుతమైన బాహుబలి హలీం రెడీ చేశారు.

పాతబస్తీలోని వీధుల్లో

పాతబస్తీలోని వీధుల్లో


ఆ బాహుబలి హలీంను తాను అది ప్రభాస్ స్నేహితుడి ద్వారా ప్రభాస్ కి పంపించడంతో అది ఆయన టెస్ట్ చేశారని, దాని ఫీడ్బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నా అని ఆమె చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే మరో పక్క రాజమౌళి మాత్రం పాతబస్తీలో హల్ చల్ చేశారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన తన కుమారుడు కార్తికేయతో కలిసి పాతబస్తీలోని వీధుల్లో కలియతిరిగారు.

సెల్ఫీలు దిగేందుకు

సెల్ఫీలు దిగేందుకు

సాధారణంగా పాతబస్తీ వారు ఎక్కువగా తెలుగు సినిమాలు చూడరు కానీ ఆర్ఆర్ఆర్ హిందీ సహా చాలా బాషలలో విడుదలవడంతో ఆయనని గుర్తించి చుట్టూ చేరిన జనం ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అందరూ ఎగబడ్డారు. ఇక ఒక హోటల్లో బిర్యానీ తిన్న అనంతరం తన కుమారుడు కార్తికేయతో కలిసి రాజమౌళి అక్కడి నుంచి వెళ్లిపోయారు అని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X