ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పేసిన పెద్దమ్మ..
సినిమా వాళ్ళ విషయంలో పెళ్లి అనేది చాలా వింతగా అనిపించే అంశం అని చెప్పాలి. చాలా మంది హీరోలు కానీ హీరోయిన్స్ కానీ చేసుకుంటే తమ కెరీర్ ఎర్లీ స్టేజి లోనే లేకపోతే చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకుంటారు. అయితే ఇది కూడా హీరోలకి ఒకలా హీరోయిన్స్ కి ఒకలా ఉంటుంది. హీరోలకి అయితే దాదాపు 30 లోపే చేసేసుకుంటారు. ఇక హీరోయిన్స్ అయితే స్టార్డం అంతా చూసేసాక లేదా లేదా ఇంకొంత కాలం స్పేస్ తీసుకొని చేసుకుంటారు.
అయితే ఈ రెండు రకాలు కాకుండా మూడో కేటగిరి కూడా ఉన్నారు. వాళ్ళే ఎంత ఏజ్ వచ్చినా కూడా సింగిల్ స్టేటస్ లోనే కనిపిస్తూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ జాబితాలో ఉంటారు. అయితే ఈ లిస్ట్ హీరోస్ లో బాలీవుడ్ సినిమా నుంచి సల్మాన్ ఖాన్ కనిపిస్తే మన టాలీవుడ్ నుంచి ప్రభాస్ మొట్ట మొదటిగా కనిపిస్తాడు.

అయితే ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనేది బాహుబలి ని కట్టప్ప ఎందుకు చంపాడు అనే దానికన్నా పెద్ద సస్పెన్స్ గా నిలిచిపోయింది.. కాగా కొన్ని రూమర్స్ ఎప్పుడూ బయటకి వస్తూనే ఉండేవి కూడా. ఆ హీరోయిన్ తో పెళ్లి, ఈ హీరోయిన్ తో పెళ్లి అసలు హీరోయిన్స్ కాదు సినిమాతో సంబంధం లేని అమ్మాయి అంటూ మరికొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ఫైనల్ గా ప్రభాస్ ఏది కాదు అన్నట్టుగా సినిమాలే చేసుకుంటున్నాడు.
ఐతే ఇది ఇంట్లో పెద్దలకి ఎప్పుడూ ఎదురవుతున్న ప్రశ్న కాగా అసలు ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనే దానిపై స్వయంగా తన పెద్దమ్మ శ్యామల దేవి గారు క్లారిటీ ఇచ్చేసారు. లేటెస్ట్ గా ప్రభాస్ నటించిన కల్కి సినిమా స్పెషల్ షో చూసిన తర్వాత మీడియాతో సినిమా పట్ల తన ఆనందాన్ని పంచుకున్నారు. కాగా ఆ సమయంలో ఎదురైన పెళ్లి ప్రశ్నకి స్పందించారు.
ఇప్పుడు కల్కి ఎలాగైతే ఆనందాన్ని సినిమా పరంగా అందించిందో ఇదే తరహా ఆనందం ముందు రోజుల్లో ప్రభాస్ పెళ్లితో కూడా కొనసాగుతుంది అని అయితే ప్రభాస్ తన ఫ్యాన్స్ కోసం సినిమాలు నాన్ స్టాప్ గా చేస్తున్నాను అంటాడని ఇవన్నీ అయ్యాక అప్పుడు ప్రభాస్ పెళ్లి ఖచ్చితంగా ఉంటుంది అని శ్యామల దేవి ఒక క్లారిటీ ఇచ్చారు.

దీనితో ఇప్పుడు ప్రభాస్ గడుపుతున్న కొంచెం బిజీ షెడ్యూల్ నుంచి గ్యాప్ దొరికితే ప్రభాస్ పెళ్ళికి స్పేస్ దక్కినట్టే లేదంటే చాలా కాలం ఆగాల్సి ఉంటుంది అని చెప్పాలి. సో ప్రభాస్ ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడే తన పెళ్లి ఉంటుంది అని పెద్దమ్మ చెప్పకనే చెప్పేసారు. సో ప్రభాస్ ఫ్యాన్స్ కి కూడా తమ అభిమాన హీరో పెళ్లి ఎప్పుడు అనే దానిపై ఓ క్లారిటీ వచ్చినట్టేగా! కానీ..
ఇప్పుడుడప్పుడే ప్రభాస్ అయితే ఖాళీ అయ్యే సూచనలు లేవని చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఇప్పుడు ప్రభాస్ చేయాల్సి ఉంది. సో ఎలా లేదన్నా మరో మూడు నాలుగేళ్లు పడుతుంది ఇవి పూర్తయ్యేసరికి మరి చూడాలి డార్లింగ్ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతాడు అనేది.


Click it and Unblock the Notifications











