ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో బాహుబలి క్రేజ్...(ఫోటో)
హైదరాబాద్: త్వరలో విడుదల కాబోతున్న రాజమౌళి ‘బాహుబలి' చిత్రం క్రేజ్ ఎంతలా ఉందంటే.....యావత్ తెలుగు ప్రేక్షక లోకం, సౌతిండియా సినీ అభిమానులు ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై క్రేజ్ ఎంతలా ఉందంటే ప్రస్తుతం వరల్డ్ కప్ మ్యాచుల్లో కూడా అభిమానులు ‘బాహుబలి'పై తమ ఇష్టాన్ని ప్రదర్శించారు.
భీమవరంకు చెందిన ప్రభాస్ అభిమానులు....ఈ రోజు మెల్ బోర్న్ స్టేడియంలో జరుగుతున్న ‘ఇండియా vs బంగ్లాదేశ్' మ్యాచులో ప్రభాస్ బాహుబలి పోస్టర్ ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటు కున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు. ‘బాహుబలి వార్ బిగిన్స్ నౌ...' అంటూ భీమవరం రెడల్స్ ఈ పోస్టర్ ప్రదర్శించారు.
సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...ప్రభాస్ హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జానపద చిత్రం 'బాహుబలి'. రానా కీలక పాత్ర పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్స్. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతూండటంతో బిజినెస్ ఊపందుకుంది. తాజాగా చిత్రం హిందీ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరుణ్ జోహార్ ఈ హిందీ రైట్స్ ని తీసుకుని రిలీజ్ చేస్తున్నారు. దాంతో భారీగా హిందీలో రిలీజ్ అవనుంది. అయితే ఈ రైట్స్ నిమిత్తం కరుణ్ ఎంత ఖర్చు పెట్టారో తెలియదు కానీ..భారీ మొత్తమే ఖర్చు పెట్టారని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మిస్తుండగా, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. 'బాహుబలి' గా ప్రభాస్ రూపమేంటో ఇప్పటికే ప్రేక్షకులకు చూపించారు రాజమౌళి. తొలి రూపు (ఫస్ట్‌లుక్)తోనే ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో రెండో పోస్టరును విడుదల చేశారు. ఈ రెండు ఈ వీరుడి సాధారణ రూపాలు. మరి యుద్ధభూమిలో 'బాహుబలి' ఎలా ఉండబోతున్నాడు అనే ఆతృత అందరిలోనూ కలిగింది. ఓ వైపు సినిమా చిత్రీకరణ జరుగుతుంటే మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి.
ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకుడు రాజమౌళి తెలిపారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం మొదటి భాగానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 'బాహుబలి-2' ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.
బాహుబలి, శివుడు.. ఇలా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'బాహుబలి'. బాహుబలి సరసన అనుష్క నటిస్తుంటే, శివుడుకి జోడీగా తమన్నా కనిపించబోతోంది. సత్యరాజ్, రమ్యకృష్ణతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్.


Click it and Unblock the Notifications











