ప్రభాస్ ఫస్ట్ లుక్, బాహబలి మేకింగ్
హైదరాబాద్: అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'బాహుబలి' మూవీ ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ రోజు ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని దీన్ని విడుదల చేసారు. అదే విధంగా 'బాహుబలి' మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేసారు. ప్రభాస్ ఫస్ట్ లుక్ బాహుబలి పోస్టర్ మూడు బాషల్లో విడుదల చేసారు. స్లైడ్ షోలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ఫోటోలతో పాటు, చివరి స్లైడ్‌లో బాహుబలి మూవీ మేకింగ్ వీడియో వీక్షించండి.

ప్రభాస్ ఫస్ట్ లుక్
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి' షూటింగ్ మూడో షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు రాణా, అనుష్క, రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమా కోసం ఫిల్మ్ సిటీలో కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ సెట్టింగులు వేసారు. అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వాస్తవికత ఉట్టిపడేలా ఈ సెట్ డిజైన్ చేసారు.

ప్రభాస్ ఫస్ట్ లుక్
ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది.

ప్రభాస్ ఫస్ట్ లుక్
దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.

ప్రభాస్ ఫస్ట్ లుక్
ఇప్పటికే ‘ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.
ప్రభాస్ ఫస్ట్ లుక్, బాహబలి మేకింగ్ వీడియో..
ప్రభాస్ ఫస్ట్ లుక్, బాహబలి మేకింగ్ వీడియో..


Click it and Unblock the Notifications











