‘బాహుబలి’ ప్రభాస్ న్యూ లుక్ హల్ చల్ (పిక్చర్స్)
హైదరాబాద్: రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి' సినిమాకు సంబంధించిన ప్రభాస్ కొత్త ఫోటోలు విడుదలై ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. యుద్ధ క్షేత్రంలో ప్రభాస్ పోరాటానికి సంబంధించిన ఫోటో ఇది. ఒక చేతిలో వీర ఖడ్గం, మరొక చేతిలో గొడ్డలి పట్టుకుని ఉన్న ఈ ఫోటో సినిమాపై అంచనాలు మరింత పెంచేలా చేస్తోంది.
ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఇది తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నడూ రాని విధంగా కళ్లు చెదిరే గ్రాఫిక్స్, పోరాట సన్నివేశాలతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేయనుంది.
2015లో విడుదల చేయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని త్వరిత గతిన పూర్తి చేస్తున్నారు. తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం రిలీజ్ డేట్ కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 17, 2015లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది.
స్లైడ్ షోలో ప్రభాస్ న్యూ లుక్‌కు సంబంధించిన ఫోటోలు...

ప్రభాస్ లుక్ అదిరి పోయింది
సినిమాలో మెయిన్ లీడ్ చేస్తున్న ప్రభాస్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన పోస్టర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

ముఖ్య పాత్రల్లో..
ఇంకా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, అడవి శేష్, సందీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

వివిధ భాషల్లో...
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీతో విదేశీ బాషల్లో కూడా విడుదల చేస్తారట.

సాంకేతికంగా...
ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు.


Click it and Unblock the Notifications











