Don't Miss!
- News సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరించుకున్న కవిత: ఎందుకంటే?
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Automobiles ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- Technology Lava నుంచి కొత్త స్మార్ట్ ఫోన్! మార్చి 22 న లాంచ్,టీజర్ విడుదలైంది
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- Sports Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
ప్రభాస్ బ్యాడ్ బాయ్ ఫైరింగ్.. ట్రెండింగ్‌లో టాప్.. రొమాంటిక్ పోస్టర్ రిలీజ్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' నుంచి ఇటీవలే విడుదలైన బ్యాడ్ బాయ్ సాంగ్ నెట్టింట హంగామా చేస్తోంది. సోషల్ మీడియాలో వేగంగా వ్యూస్ రాబడుతూ సరికొత్త రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది. ఈ సాంగ్‌లో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో ప్రభాస్ చేసిన రొమాన్స్ హైలైట్ అవుతోంది. ప్రస్తుతం బ్యాడ్ బాయ్ సాంగ్ యూ ట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్‌లో టాప్ ర్యాంక్ లో కొనసాగుతోంది.
ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ ద్వారా బ్యాడ్ బాయ్ సాంగ్ యూ ట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉందని తెలిపింది టీ సిరీస్ యాజమాన్యం. బ్యాడ్ బాయ్ అంటూ ఉర్రూతలూగించే ట్యూన్స్ నడుమ శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇతర అందాల భామలతో ప్రభాస్ చేస్తున్న రొమాన్స్ హైలైట్ అవుతుండటంతో ఈ వీడియో సాంగ్ విడుదలైన వెంటనే యూ ట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్‌లో చేరిపోయి ప్రస్తుతం మొదటి స్థానంలో కొనసాగుతోంది.
బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా 'సాహో' కావడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. దీనికి తోడు హై టెక్నికల్ వ్యాల్యూస్ జోడించి షూటింగ్ జరపడం, దాదాపు రెండేళ్ల తర్వాత వస్తున్న ప్రభాస్ హీరోగా వెండితెరపై కనిపించనుండటంతో ప్రేక్షకుల్లో ఉన్న ఆత్రుత రెట్టింపయింది.
We are on a roll 🔥 #BadBoy trending at #1 on @YoutubeIndia! #30AugWithSaaho#Prabhas @ShraddhaKapoor @Asli_Jacqueline @sujeethsign @Its_Badshah @neetimohan18 #VinayakSasikumar @Benny_Dayal @SunithaSarathy @sreejo1 #RajuSundaram @VigneshShivN @adityadevmusic pic.twitter.com/Pf8L94BqMw
— TSeries (@TSeries) August 20, 2019
యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రధ్ధాకపూర్ హీరోయిన్గా నటించింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ఏ, విక్రమ్‌లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించారు. చిత్రంలో జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, వెన్నెల కిషోర్, ఎవిలిన్ శర్మ, చుంకి పాండే, మందిరా బేడి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 30 వ తేదీన సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.