బ్యాంకాక్‌‌లో రెబల్ షూటింగ్... ప్రభాస్ గొడవ!

By Bojja Kumar

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో 'రెబల్' సినిమా చూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది. సినిమాకు సంబంధించిన ప్రభాస్ విలన్లతో గొడవ పడే సన్నివేశాల నేపథ్యంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సీన్లు పూర్తయిన వెంటనే పాటల చిత్రీకరణ జరుగనుంది.

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ నటిస్తున్నారు. ప్రభాస్ ఇమేజ్ కు ఏమాత్రం తగ్గకుండా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రాఘవ లారెన్స్. ఇటీవల కాలంలో పలు హిట్ చిత్రాలతో దూసుకెలుతున్న లారెన్స్ ఈ చిత్రం ద్వారా అగ్రదర్శకుల సరసన చేయాలని ఉవ్విల్లూరుతున్నాడు. అందుకే ప్రభాస్ ను న్యూ లుక్ తో చూపించే ప్రయత్నం చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు.

ఈ చిత్రన్ని శ్రీబాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె పుల్లారావు, జె భగవాన్ నిర్మిస్తున్నారు. వరుస హిట్లతో మంచి పేరు తెచ్చుకున్న తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాంప్రసాద్, మాటలు: స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X