అనుష్క, ప్రభాస్ ఇద్దరూ వస్తున్నారు.. కన్నుల పండుగే.. ఎన్టీఆర్, చరణ్ ప్రారంభించేది!

Recommended Video

RRR Movie : Prabhas To Attend As Chief Guest RRR Movie Launch Event

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ క్రేజీ కాంబినేషన్ లో తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద చిత్రం ప్రారంభం కాబోతోంది. దర్శక ధీరుడు రాజమౌళి.. ఎన్టీఆర్, చరణ్ తో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమా అంటేనే ఇప్పుడు జాతీయ వ్యాప్తంగా మీడియాలో మోతెక్కి పోయే అంశం. అలాంటిది రాంచరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ పవర్ ఆ చిత్రానికి తోడైతే అందరూ కళ్లప్పగించి ఈ చిత్రం కోసం ఎదురుచూడడం ఖాయం. ఈ భారీ చిత్ర ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం అయింది.

ముహూర్తం క్రేజీగా

ముహూర్తం క్రేజీగా

ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఆసక్తికరమైన ముహూర్తం ఫిక్స్ చేశారు. నవంబర్ 11 న ఉదయం 11 గంటలకు ఈ చిత్రాన్ని లాంచ్ చేయనున్నారు. అంటే 11వ నెల, 11వ తేదీ, 11 గంటలకు ఈ చిత్రం ప్రారంభం కానుంది. కాంబినేషన్ తోనే ఉత్కంఠ పెంచేస్తున్న ఈ చిత్రాన్ని బడా నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నారు.

బాహుబలికి స్వాగతం

బాహుబలికి స్వాగతం

ఈ చిత్రానికి ఆర్ఆర్ఆర్ అనేది వర్కింగ్ టైటిల్. ఆర్ఆర్ఆర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రభాస్ ని రాజమౌళి ఆహ్వానించారట. బాహుబలి రెండు భాగాల కోసం వీరిద్దరూ దాదాపుగా మూడేళ్లకు పైగా కలసి పనిచేశారు. దీనితో రాజమౌళి, ప్రభాస్ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.

దేవసేన కూడా

దేవసేన కూడా

ప్రభాస్ రాకతో అంతా అయిపోలేదు. దేవసేన అనుష్క, భల్లాలదేవుడు రానా కూడా ఈ మెగా ఈవెంట్ కు అతిధులుగా హాజరవుతారట. మొత్తంగా బాహుబలి తారల సందడితో వైభవంగా ఆర్ఆర్ఆర్ ప్రారంభం కానుంది. క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో మరికొంత మంది బడా సెలెబ్రిటీలు కూడా అతిధులుగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రారంభం అయ్యేది బాహుబలి టీం సమక్షంలోనే.

బాక్సింగ్ అంటూ మళ్ళీ వార్తలు

బాక్సింగ్ అంటూ మళ్ళీ వార్తలు

ఎన్టీఆర్, రాంచరణ్ కాంబోలో రాజమౌళి భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు వచ్చిన వెంటనే కథ గురించి కూడా అనేక ఊహాగానాలు వినిపించాయి. రాంచరణ్, ఎన్టీఆర్ ఈ చిత్రంలో బాక్సర్స్ గా కనిపిస్తారని ప్రచారం జరిగింది. అలాంటి వార్తలే మళ్ళీ వినిపిస్తున్నాయి. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోందని చరణ్, ఎన్టీఆర్ బాక్సర్లుగా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.

 తొలి షెడ్యూల్‌కి అంతా సిద్ధం

తొలి షెడ్యూల్‌కి అంతా సిద్ధం

సినిమా లాంచ్ అయిన వెంటనే రాజమౌళి షూటింగ్ కూడా ప్రారంభించనున్నారు. తొలి షెడ్యూల్ కోసం ఇప్పటికే అంతా సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తాజాగా అరవింద సమేత చిత్రంలో విజయం సొంతం చేసుకున్నాడు. ఇక రాంచరణ్ బోయపాటి దర్శత్వంలో నటిస్తున్న చిత్రం చివరి దశకు చేసురుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X