ప్రిన్స్ మహేష్‌ను ఓడించిన ప్రభాస్.. సౌత్ సూపర్‌స్టార్‌గా బాహుబలి!

By Rajababu

Recommended Video

Prabhas Overtakes Mahesh Babu In Race

టాలీవుడ్‌లో ప్రిన్స్ మహేష్‌బాబు, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ లాంటి అగ్ర హీరోలు సంచలన విజయాలతో దూసుకెళ్తున్నారు. వారు బాహుబలి, రంగస్థలం, భరత్ అను నేను, జై లవకుశ చిత్రాలు రికార్డు స్థాయి వసూళ్లను సాధించాయి. ఓవర్సీస్‌లో బాలీవుడ్ చిత్రాలకు ధీటుగా టాలీవుడ్ హీరోల చిత్రాలు కలెక్షన్లను కొల్లగొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో ఆసక్తికరమైన సర్వే జరిగింది. ఆ సర్వేలో ప్రిన్స్ మహేష్‌పై ప్రభాస్ విజయం సాధించడంతో దక్షిణాదిలో ప్రభాస్ అతిపెద్ద సూపర్‌స్టార్‌గా నిలవడం గమనార్హం.

రికార్డుస్థాయి వసూళ్లు

రికార్డుస్థాయి వసూళ్లు

గతంలో బాహుబలి2 చిత్రం చెన్నై బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. అయితే బాహుబలి రికార్డును ఇటీవల విడుదలైన ప్రిన్స్ మహేష్‌బాబు చిత్రం భరత్ అనే నేను అధిగమించింది. భరత్ అనే నేను 2018లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే.

సౌత్ సూపర్‌స్టార్‌గా

సౌత్ సూపర్‌స్టార్‌గా

ఇలా భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న హీరోల్లో ఎవరు దక్షిణాది సూపర్‌స్టార్ అనే విషయంపై చర్చ జరిగింది. ఆ విషయాన్ని తేల్చేందుకు సౌత్ సూపర్‌స్టార్ ఎవరు అనే పోటీని ఓ ప్రముఖ సంస్థ నిర్వహించింది. ఆ పోటీలో 52 శాతం ఓట్లతో ప్రిన్స్ మహేష్‌పై ప్రభాస్ గెలిచినట్టు ఓ ఆంగ్ల వెబ్ పత్రిక కథనంలో పేర్కొన్నది.

సాహోపై ప్రభాస్ దృష్టి

సాహోపై ప్రభాస్ దృష్టి

గతేడాది రిలీజైన బాహుబలి2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1700 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. కేవలం యాక్షన్ సన్నివేశాల కోసమే రూ.90 కోట్లు ఖర్చు చేయడం సినీ వర్గాల్లో చర్చానీయాంశమైంది.

ప్రిన్స్ భరత్ అనే నేను

ప్రిన్స్ భరత్ అనే నేను

అలాగే ప్రిన్స్ మహేష్ నటించిన భరత్ అనే నేను చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.200 కోట్లు వసూలు చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రిన్స్ మహేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X