రెమ్యూనరేషన్లో హీరోలందరికంటే ప్రభాస్ టాప్!
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' మూవీ ఎన్ని రికార్డులు సృష్టించిందో, ఎన్ని సంచనాలు నమోదు చేసిందో కొత్తగా చెప్పక్కర్లేదు. సినిమా దర్శక నిర్మాతలు, ప్రేక్షకులు ఊహించని విధంగా ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది.
ఇప్పటి వరకు ఓవరాల్ గా దాదాపు రూ. 560 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా ప్రపంచంలో ఓ తెలుగు సినిమా అద్భుతాలు సృష్టించింది. సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి రాజమౌళి టాలెంటుతో పాటు, ప్రభాస్ స్టార్ ఇమేజ్ కూడా ముఖ్యపాత్ర వహించిందని చెప్పక తప్పదు.
బాహుబలి సినిమా కోసం ప్రభాస్ చాలా కష్టపడ్డాడు. మూడేళ్ల పాటు కేవలం ఈ సినిమా కోసమే తన సమయం మొత్త కేటాయించాడు. అందుకే ఈ సినిమాకు ప్రభాస్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకున్నారు. తొలి చిత్రానికి ప్రభాస్ ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారనే విషయం ఖశ్చితంగా తెలియక పోయినా.... ఆ మద్య రామ్ గోపాల్ వర్మ మాత్రం ప్రభాస్ రూ. 65 కోట్లు అందుకున్నట్లు ట్వీట్ చేసారు. మూడేళ్ల సమయం, భారీగా శ్రమ పడ్డందుకు ప్రభాస్ కు తగిన ఫలితమే దక్కిందని అంతా సంతోష పడ్డారు.

ఇక బాహుబలి పార్ట్ 2 సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ మరింత పెరుగుతుందని అంటున్నారు. బాహుబలి పార్ట్ 1 భారీ విజయం సాధించిన నేపథ్యంలో పార్ట్ 2 అంతకు మించిన ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలో హీరో ప్రభాస్ కు కూడా లాభాల్లో వాటా పెంచాలని రాజమౌళి నిర్ణయించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్లోనే కాదు... సౌతిండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా ప్రభాస్ త్వరలో చరిత్ర సృష్టించబోతున్నాడని అంటున్నారు.
బాహుబలి పార్ట్ 2 షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. పార్ట్ 1తో పాటు పార్ట్ 2 షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయింది. మిగిలిన షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది. అన్నికార్యక్రమాలు పూర్తి చేసి 2016లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











