ప్రభాస్ ఫ్యాన్స్ కొంచెం ఆగండి.. క్రేజీ న్యూస్, 2019లో అని తేల్చేశాడు!
Recommended Video

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల తరచుగా వార్తల్లో నిలిస్తున్నాడు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరింది. దీనితో రూమర్స్ కూడా పెరిగాయి ప్రభాస్ గురించి ఎన్నో ఊహాగానాలు సోషల్ మీడియాలో తరచుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రభాస్ ప్రస్తుతం రెండు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రభాస్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురుచూస్తున్నారు. యువ దర్శకుడు సుజిత్ సాహో చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, జిల్ ఫేమ్ రాధాకృష్ణ ప్రభాస్ తో ఓ ప్రేమ కథని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం గురించి రాధాకృష్ణ ఆసక్తికర విషయంవెల్లడించాడు .

సాహో విడుదల ఖరారు
బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి ఒక్క చిత్రం కూడారాలేదు. సాహో చిత్రీకరణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల చిత్ర యూనిట్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రభాస్ సాహో విడుదల తేదీ ప్రకటించారు. వచ్చే ఏడాది ఆగష్టు 15న సాహో చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరక్కుతున్న ఈ చిత్రంపై కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు ఉన్నాయి.

తొందరపడకండి
సాహో విడుదల తేదీతో అభిమానులు సంతృప్తి చెందడం లేదు. దర్శకుడు రాధాకృష్ణని కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ప్రభాస్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రేమ కథ గురించి అప్డేట్ ఇవ్వాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అభిమానులు ఉత్సాహాన్ని ఆపలేకపోయిన రాధాకృష్ణ ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. 1960 నాటి పరిస్థితుల నేపథ్యంలో అద్భుతమైన ప్రేమ కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
2019కి పక్కా
ప్రభాస్ 20వ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని 2019 చివరినాటికి ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేస్తాం. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు తొందర పడకండి. అన్ని ఆసక్తికరమైన విశేషాలు సరైన సమయం వచ్చినప్పుడు రివీల్ చేస్తాం అని రాధాకృష్ణ తెలిపారు. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తోంది. పాతకాలం నాటి కార్లని ఇష్టపడే ధనవంతుడి పాత్రలో ప్రభాస్ ఈ చిత్రంలో కనిపిస్తాడట.

వైరల్ అవుతున్న రూమర్
ఈ చిత్రం గురించి క్రేజీ రూమర్ కూడా వినిపిస్తోంది. ఈ చిత్రంలో వచ్చే ప్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో ఓ హీరోయిన్ పాత్రకు ఆస్కారం ఉందట. ఆ పాత్ర కోసం అనుష్కని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్, అనుష్క సూపర్ హిట్ జోడి. ఈపాత్రకు అనుష్క అయితే బావుంటుందని దర్శకుడు కూడా భావిస్తున్నాడని సమాచారం. దీనిగురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











