twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆకాష్‌ను చూసి షాకయ్యాను: ‘మెహబూబా’పై ప్రభాస్ కామెంట్

    By Bojja Kumar
    |

    Recommended Video

    Prabhas Congrats To Mehbooba Team

    పూరి జగన్నాధ్ తన తాజా సినిమా 'మెహబూబా' ద్వారా కుమారుడు ఆకాష్ పూరిని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. మే 11న సినిమా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. వారసుడిని ఇండస్ట్రీలో నిలబెట్టడం కోసం పూరి స్పెషల్ ‌గా స్టోరీ తయారు చేశారు. తన శైలికి భిన్నమైన కథతో ఆకాష్‌ను లాంచ్ చేస్తున్నాడు. సాధారణంగా పూరి సినిమాలు హీరో క్యారెక్టరైజేషన్ చుట్టూ తిరుగుతాయి. కానీ 'మెహబూబా' కోసం 1971 ఇండియా-పాకిస్థాన్ వార్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నారు ఈ క్రేజీ డైరెక్టర్. తాజాగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

    పూరి సినిమాలు అసలు ఇలా ఉండవు: ప్రభాస్

    పూరి సినిమాలు అసలు ఇలా ఉండవు: ప్రభాస్

    ‘మెహబూబా' ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‍‌గా ఉంది. షాకింగ్ ఏమిటంటే... పూరి సినిమాలు అసలు ఇలా ఉండవు. ఆయన సినిమాలు ఎక్కువగా హీరో క్యారెక్టరైజేషన్ మీద ఉంటుంది. సడెన్‌గా ఈ సినిమాలో బ్యూటిఫుల్ విజువల్స్ కనిపిస్తున్నాయి. వార్ బ్యాక్ డ్రాప్, వార్ ప్లేన్స్ కనిపిస్తున్నాయి. ఇదే విషయం పూరికి ఫోన్ చేసి చెప్పాను. ట్రైలర్ నాకు బాగా నచ్చింది. అంటూ పూరి డార్లింగ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు ప్రభాస్.

     ఆకాష్‌ను చూడగానే షాకయ్యాను

    ఆకాష్‌ను చూడగానే షాకయ్యాను

    ఆకాష్‌ను చూడగానే షాకయ్యాను. బుజ్జిగాడులో నా యంగ్ వెర్షన్ ఆకాష్ చేశాడు. ఈ రోజు హీరో అయ్యాడు. చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్లో చాలా ఇంప్రెస్ చేశాడు. పెర్ఫార్మెన్స్, వాయిస్, డైలాగ్ డెలివరీ సూపర్బ్ అనేలా ఉన్నాయి. ఆకాష్ ఫస్ట్ ఫిల్మ్ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మెహబూబా టీం, ఆకాష్, పూరి డార్లింగ్ కు ఆల్ ది బెస్ట్. ఆకాష్ మా ఫ్యామిలీలో ఒకరు, చాలా పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను అని ప్రభాస్ ఆకాంక్షించారు.

     మెహబూబా

    మెహబూబా

    పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి, నేహా శెట్టి జంటగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'మెహబూబా'. మే 11న సమ్మర్‌ స్పెషల్‌గా 'మెహబూబా' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    ఇంటిని అమ్మేసిన పూరి

    ‘మెహబూబా' సినిమా కోసం తన ప్రాపర్టీల్లో ఒకటైన ఇంటిని పూరి జగన్నాధ్ అమ్మేశారట. కొడుకును హీరోగా నిలబెట్టే సినిమా కావడం, తాను రాసుకున్న కథపై పూర్తి నమ్మకం ఉండటంతో ఈ రిస్క్ చేశాడు. తనకు ఇలాంటివి కొత్తేమీ కాదని, ఎన్నోసార్లు డబ్బు పోగొట్టుకున్నాను. మళ్లీ సంపాదించుకున్నాను. రిస్క్ చేయకపోతే జీవితంలో ఏమీ సాధించలేం అని పూరి అన్నారు.

    English summary
    Prabhas Best Wishes to Akash Puri, Prabhas Best Wishes to Mehbooba Movie Team, Mehbooba Movie release Date, Mehbooba Movie Review, Mehbooba Movie Public Talk
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X