twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డాన్ ల అండతో భిల్లా?

    By Staff
    |

    Billa
    ప్రభాస్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ భిల్లా రీమేక్ అవుతోందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడా చిత్రం ఆడియోని డాన్స్(అజిత్, రజనీకాంత్, అమితాబ్, షారూఖ్ ఖాన్)సమక్షంలో చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ పై చిరకాల విరామం తర్వాత వస్తున్న సినిమా కావటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లుగానే ప్రతీ స్టెప్ లోనూ విభిన్నంగా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ చిత్రంలో అనూష్క..నయనతార పాత్రలో బికినీ వేసుకుని మురిపించటానికి రెడీ అవుతోంది.

    అలాగే హన్సిక ముఫ్ఫై లక్షల తీసుకుని ఓ ఐటం సాంగ్ ని చేస్తోంది. ప్రబాస్ డాన్ గానూ, సామాన్యుడు గానూ రెండుపాత్రల్లో స్టైలిష్ గా కనపడనున్నాడు. ఇక నిర్మాత కృష్ణంరాజు..కథకు కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రను చేయనున్నారు. మార్చి మూడవ వారంలో ఆడియో రిలీజ్ కానుంది. ఇవన్నీ ఇలా ఉంటే తమిళ భిల్లా పేరునే తెలుగుకీ కొనసాగించటం మన సృజనాత్మ రాహిత్యాన్నే సూచిస్తోందంటూ విమర్శలు వస్తున్నాయి. రీమేక్ పేరుతో ఫ్రేమ్ టు ఫ్రేమ్ కాపీ చేస్తూ తిరిగి టైటిల్ ను కూడా వాడుకోవాలా అంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X