ప్రభాస్ భిల్లా హాట్ న్యూస్

By Staff

Billa
ప్రభాస్ ప్రతిష్టాత్మకంగా భావించి నటిస్తున్న భిల్లా చిత్రం మార్చి ఇరవై ఏడున రిలీజ్ కానుందని సమాచారం. ఇక కంత్రి ఫేమ్ మెహర్ రమేష్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు తన గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రం గురించి మెహర్ రమేష్ మాట్లాడుతూ..ఈ సినిమా కోసం ప్రభాస్..ఎయిట్ ప్యాక్ లో కనిపించనున్నాడు. అంతేకాక ఈ సినిమా లొకేషన్స్ ఇంతకు ముందు ఎప్పుడూ షూట్ చేయని మలేషియా లొకేషన్స్ ఎంపికచేసి తీసాం. ఓ జేమ్స్ బాండ్ సినిమాలా ఈ చిత్రం ఆద్యంతం ధ్రిల్లింగ్ గా సాగుతుంది. అంతేగాక ఈ చిత్రం మొత్తం సూపర్ 35 mm కెమెరాతో చిత్రీకరించాం. ఆ ఎఫెక్టు తెరపై బాగా ఎంజాయ్ చేయగలం అని చెప్తున్నారు.

రెండు పాటలు మినహా పూర్తయిన ఈ చిత్రంలో కృష్ణంరాజు పోలీస్ ఆఫీసర్ గా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అందరూ ఆశలకు తగినట్లుగానే అనూష్క బికినీ వేసుకుని తన అందాలను చూపనుంది. నమిత ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తుంది. హన్సిక ఓ ఐటం సాంగ్ చేయనుంది. ప్రభాస్ డబుల్ పాత్రల్లో కనపడతారు. మణిశర్మ స్వరపరిచిన పాటలు అందరినీ అలరిస్తాయని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం తమిళ భిల్లా రైట్స్ కొని చేస్తున్నారు.అందులో అజిత్ చేసిన పాత్రను ప్రభాస్ చేస్తూండగా,నయనతార చేసిన పాత్రను అనూష్క చేస్తోంది. ఈ అమితాబ్ డాన్ చిత్రం ని మోడ్రనైజ్ చేస్తే పుట్టిందే. తెలుగులో అప్పట్లో ఈ చిత్రాన్ని ఎన్టీఆర్..యుగంధర్ పేరుతో చేసారు. అప్పటి మ్యాజిక్ ని రిపీట్ చేస్తారా లేదా అన్నది చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X