'బాహుబలి' గురించి ప్రభాస్ స్పెషల్ ఇంటర్వూ (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : ప్రభాస్‌ నటుడిగానూ తన శైలి బయటపెడుతూనే ఉన్నాడు. ప్రతీ సినిమాకీ ఒక్కో మెట్టు ఎదుగుతూ.. ఇప్పుడు 'బాహుబలి'గా మారాడు. ఇప్పుడు అందరి దృష్టీ 'బాహుబలి'పైనే. ఈ సినిమా కోసం ప్రభాస్‌ చేసిన కసరత్తులు అన్నీ ఇన్నీ కావు. 'బాహుబలి' కోసమే భారీగా బరువు పెంచాడు. గుర్రపుస్వారీ, కత్తి యుద్ధాలూ, కసరత్తులూ... ఇలా చెమటోడ్చాడు. అసలే తెలుగు హీమాన్‌లా ఉంటాడు.

దానికి రాజమౌళి తరహా శిక్షణ తోడైంది. అందుకే రెండు చేతుల్లోనూ ఆయుధాలు అందుకొన్న ప్రభాస్‌ ఛాయాచిత్రాన్ని చూడగానే నిజమైన యుద్ధవీరుడు దిగొచ్చాడేమో అనిపించింది. 2015లో ప్రధమార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి తన అభిమానులుకు కొన్నివిషయాలు చెప్పాలనుకున్నాడు ప్రభాస్. ఇదిగో ఈ వీడియోలో ఆ విషయాలన్నీ ఉన్నాయి...చూడండి..

( లేకపోతే ఈ లింక్ నుంచి చూడండి ... https://www.youtube.com/watch?v=NszueH0UAnU&feature=player_embedded)

మాస్‌ హీరోకి నికార్సయిన ప్రతిరూపం ప్రభాస్. క్లాస్‌ కథలకు 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌'. రాజమౌళి 'ఛత్రపతి'... ప్రభాస్‌ చేత మరో పదడుగులు వేయించింది. 'ఛత్రపతి' ఇమేజ్‌ నుంచి బయటకు రావడానికి చాలా కష్టపడాల్సొచింది. రూటు మారిస్తే గానీ హిట్టు దక్కదని గ్రహించి 'బుజ్జిగాడు'గా మారిపోయాడు. ప్రభాస్‌లో ఇదో కొత్త యాంగిల్‌. 'యాండే.. ఓసారి మాట్లాడండే.. ఓ పాట పాడండే..' అంటూ కొత్త మేనరిజంతో మాయ చేశాడు.

Prabhas Birthday Special Interview about Baahubali

తెలుగు జేమ్స్‌బాండ్‌లా 'బిల్లా'లో స్త్టెలీష్‌గా కనిపించాడు. 'డార్లింగ్‌', 'మిస్టర్‌ పెర్‌ఫెక్ట్‌', 'మిర్చి'... ఇలా ప్రతీ సినిమాకీ కొత్తగా కనిపించడం అలవాటు చేసుకొన్నాడు ప్రభాస్‌. అతని స్త్టెల్‌ అమ్మాయిలకు నచ్చింది. యాక్షన్‌ ఇమేజ్‌ కుర్రకారుని ఆకర్షించింది. 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌', 'డార్లింగ్‌'లాంటి కథలతో కుటుంబ ప్రేక్షకులూ ప్రభాస్‌ని ఇష్టపడడం ప్రారంభించారు. ఇప్పుడు మళ్లీ బాహుబలి అంటూ మన ముందుకు వస్తున్నాడు.

ఇక ప్రభాస్‌ పుట్టినరోజును అభిమానులు ఈ నెల 23న జరుపుకొన్నారు. ఆ రోజున 'బాహుబలి' ప్రచార చిత్రం విడుదలవుతుందని ఆశగా ఎదురుచూశారు. కానీ రాజమౌళి నుంచి అలాంటి కానుకలేం రాలేదు. వీటిపై రాజమౌళి స్పందిస్తూ ''ప్రభాస్‌ అభిమానులూ క్షమించాలి. రెండేళ్లుగా మీ కథానాయకుడిని మీ అందరికీ దూరం చేశా.

ఓ మంచి సినిమాను అందించాలన్న ఉద్దేశంతోనే మేమంతా కష్టపడుతున్నాం. 'బాహుబలి' విడుదల అయ్యాక ఆ కోపాన్ని మర్చిపోతారని ఆశిస్తున్నా. మొదట్లో నటీనటులు, సాంకేతిక నిపుణుల పుట్టిన రోజుకు ఓ ప్రత్యేక ప్రచార చిత్రం విడుదల చేసేవాళ్లం. కానీ ఇప్పుడు పని ఒత్తిడి వల్ల టీజర్లు రూపొందించలేకపోతున్నామ''న్నారాయన.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X