twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ బర్త్ డే స్పెషల్: ‘సాహో’ మూవీ ఫస్ట్ లుక్ ఇదే...

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘సాహో’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా శ్రద్ధా కపూర్‌ నటిస్తోంది.

    By Bojja Kumar
    |

    Recommended Video

    ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ‘సాహో’ మూవీ ఫస్ట్ లుక్ ఇదే...

    'బాహుబలి' స్టార్ ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం 'సాహో' మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందా? ప్రభాస్ ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నారు? అని ఎదురు చూసిన ఫ్యాన్స్ నిరీక్షణకు నేడు తెరపడింది.

    ఫస్ట్ లుక్ పోస్టర్లో ప్రభాస్‌ డిఫరెంట్ లుక్ లో కనిపించారు. బాహుబలి కోసం భారీగా కండలు పెంచిన యంగ్ రెబల్ స్టార్ ఈ చిత్రంలో స్లిమ్ లుక్ లో కనిపించబోతున్నారని ఈ పోస్టర్ బట్టి స్పష్టమవుతోంది. బ్లాక్‌ కోట్‌ ధరించి ఒక చెయ్యి పాకెట్‌లో మరో చేతిలో ఫోన్‌ పట్టుకుని స్టైలిష్ లుక్ తో ప్రభాస్ దర్శనమిచ్చారు.

    ముసుగుతో ఫస్ట్ లుక్

    అయితే ఫస్ట్ లుక్ పోస్టర్లో ప్రభాస్ ముఖం పూర్తిగా కనిపించకుండా సగం వరకు ముసుగగు వేసి ఉండటం గమనార్హం. సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఏమిటి? అనేది సినిమా ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్ రిలీజ్ అయితే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

    శ్రద్ధా కపూర్

    శ్రద్ధా కపూర్

    బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని.... శ్రద్ధా కపూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాను ‘సాహో' ప్రాజెక్టులో భాగం కావడం సంతోషంగా ఉందని, నా కెరీర్లో చేస్తున్న తొలి మల్టీ లాంగ్వేజ్ మూవీ. ఈ చిత్రంలో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది. అలాంటి పాత్ర చేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అని శ్రద్ధా కపూర్ తెలిపారు.

    150 కోట్ల భారీ బడ్జెట్

    150 కోట్ల భారీ బడ్జెట్

    ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా శ్రద్ధా కపూర్‌ నటిస్తోంది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

    భారీ యాక్షన్ సీన్స్

    భారీ యాక్షన్ సీన్స్

    తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించారు. రూ. 150 కోట్లలో రూ. 40 కోట్లు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించేందుకే ఖర్చు చేస్తున్నారట.

    English summary
    On the occasion of Telugu actor Prabhas' 38th birthday, the makers of Sujeeth's trilingual action thriller Saaho released the film's first look.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X