ప్రభాస్ మా అందరికీ చాలా గొప్ప ప్రేరణ: అలహాబాద్ పోలీస్ అధికారిణి

ప్రభాస్ ఇప్పుడు కేవలం టాలీవుడ్ నటుడు కాదు నేషనల్ స్థాయి హీరో. నిన్నా మొన్నటి దాకా నార్త్ ఇండియన్ ప్రేక్షకులకి నాగార్జున, చిరంజీవి లాంటి హీరోలు మాత్రమే తెలుసు.

ప్రభాస్ ఇప్పుడు కేవలం టాలీవుడ్ నటుడు కాదు నేషనల్ స్థాయి హీరో. నిన్నా మొన్నటి దాకా నార్త్ ఇండియన్ ప్రేక్షకులకి నాగార్జున, చిరంజీవి లాంటి హీరోలు మాత్రమే తెలుసు. అదీ మామూలుగా తెలుసు తప్ప మరీ అభిమానులు అంటూ పెద్దగా లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. బాహుబలి అనే ఒక్క సినిమా ప్రభాస్ ని ఉత్తరాది ప్రేక్షకులకి దగ్గర చేసింది. అదీ అలా ఇలా కాదు ప్రభాస్ సొంత మార్కెట్ ఏర్పాటు చేసుకోగల క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఉంది. ఇప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన ఉత్తరాదిలో ప్రభాస్ అంటే ఎంత క్రేజ్ ఉందో తెలిపేలా ఉంది... అలహాబ్ద్ లో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించ బడ్డాయి అంటే ఇప్పుడు ఈ బాహుబలి వాళ్ళకి ఎంత నచ్చాడో అర్థం కావట్లేదూ...

అలహాబాద్ సిటీ పోలీస్.. మహిళా క్రైం బ్రాంచ్ విభాగం.. తమ విధి నిర్వహణ అనంతరం అంతా కలిసి ప్రభాస్ బర్త్‌డేని సెలబ్రేట్ చేశారట. వారిలో ఒక అధికారిణి ప్రభాస్‌కు బిగ్ ఫ్యాన్ అట. ఆమె మాట్లాడుతూ "ప్రభాస్ బర్త్‌డేని సెలబ్రేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఫీలవుతున్నాం. మా అభిమానం.. విషెస్ ఆయన్ను చేరాలని కోరుకుంటున్నాం. మహిళా క్రైం బ్రాంచ్ విభాగం నుంచి ప్రభాస్‌కి బర్త్‌డే విషెస్ తెలుపుతున్నాం" అన్నారు. అంతేకాదు.

 Prabhas Bith Day Celabrations at Women Crime Branch of Ahmedabad

ఇంకా ఆమె తన లైఫ్‌లో ప్రభాస్ ఎంత ముఖ్యమైన పాత్ర వహిస్తారో తెలిపారు. "ప్రభాస్ నా లైఫ్. నా జీవితంలో నేను ఎన్నో బాధలను అనుభవించాను.. కానీ స్ట్రగుల్స్‌లో ఉన్న ప్రతిసారీ ఆయన్ను స్క్రీన్‌పై చూసి అవన్నీ మరచిపోయేదాన్ని. నేను ప్రభాస్ చాలా పెద్ద అభిమానిని. ఆయన్ను చూసినప్పుడల్లా.. చాలా ఆనందంగా.. అనిపిస్తుంది. ప్రభాస్ మా అందరికీ చాలా గొప్ప ప్రేరణ." అంటూ ప్రభాస్‌పై తనకున్న అభిప్రాయాన్ని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X