కొత్త కారు కొన్న ప్రభాస్.. ఇండియాలోనే రెండో కారు.. ధర ఎంతంటే?
ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్. బాహుబలి సినిమాతో ప్రభాస్ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరింది. అయితే ప్రభాస్ రేంజ్, ఆయనకున్న ఇమేజ్‌ను సాహో మ్యాచ్ చేయలేకపోయింది. అయితే సాహో సినిమాతో ప్రభాస్ ఉత్తరాది ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియన్ సినిమాలను లైన్‌లో పెట్టేస్తున్నాడు. దానికి తగ్గటే ప్రభాస్ ఇప్పుడు తన లైఫ్ స్టైల్‌ను మార్చేసుకుంటున్నాడు.

అన్నీ కూడా నేషనల్ లెవెల్‌లోనే..
ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రం దాదాపు పూర్తి కావాల్సి వస్తోంది. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సలార్ పోస్టర్లతోనే దుమ్ములేపుతోంది. ఇక ఆది పురుష్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓం రావత్ తెరకెక్కిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌లో రాముడిగా ప్రభాస్ కనిపించబోతోన్నాడు. ఇక నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కూడా రెడీగా ఉంది.

ముంబై కేంద్రంగా..
ప్రస్తుతం ప్రభాస్ కదలికలన్నీ కూడా ముంబై కేంద్రంగానే జరుగుతున్నాయి. ఆది పురుష్ సినిమా షూటింగ్ అంతా కూడా అక్కడే జరుగుతోంది. ఇకపై బాలీవుడ్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టిన ప్రభాస్ ముంబైలో ఉండాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే అక్కడ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది.

తాజాగా అలా..
మామూలుగా స్టార్ హీరోలు, సెలెబ్రిటీలకు కొన్నింటిపై మోజు ఉంటుంది. అలా ప్రభాస్‌కు కార్లంటే ఇష్టం. ఇలా ఇప్పటికే ప్రభాస్ దగ్గర బీఎమ్‌డబ్ల్యూ 520D, ఇన్నోవా క్రిస్టా, జగువార్ ఎక్స్‌జేఎల్, రేంజ్ రోవర్ వోగ్, రోల్స్ రాయ్స్ గోస్ట్ కార్లు ఉన్నట్లు సమాచారం. తాజాగా ప్రభాస్ కొత్త కారు కొన్నాడని తెలుస్తోంది.

కారు ధర ఎంతంటే..
తాజాగా ప్రభాస్ లంబోర్గిని కారు కొన్నట్టు.. అది ఈ ఆది వారం డెలివరీ అయినట్టు తెలుస్తోంది. ప్రభాస్‌కు లంబోర్గిని అవెంటాడర్ ఎస్ రోడ్‌స్టర్ కారును డెలివరీ చేయడంతో ఇది ఇండియాలో రెండోదని..సక్సెస్ ఫుల్‌గా డెలివరీ చేసేశామని ఆ సంస్థ చెప్పుకొచ్చింది. దీని ధర 5 నుంచి 6కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











