Prabhas: సలార్ బాక్సాఫీస్ ఊచకోత మొదలు... వేణు స్వామి జోస్యాన్ని బ్రేక్ చేసిన ప్రభాస్
ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సెలబ్రిటీల జాతకం చెప్తూ చాలా ఫేమస్ అయ్యాడు. ప్రభాస్ జాతకంలో దోషం ఉందని గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా సార్లు చెప్పుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరియర్ ముగిసింది. ఇక సినిమాలు తీయడం మానుకోవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ జోస్యాన్ని ప్రభాస్ బ్రేక్ చేశాడని తెలుస్తోంది. ఆయన నటించిన తాజా చిత్రం సలార్.. బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు చేయనున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అసలు విషయం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సినీ తారాలు, ప్రముఖుల జాతాకాలు చెబుతూ.. ప్రముఖు వేణు స్వామి పాపులర్ అయ్యారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత పెళ్లి చేసుకున్నప్పుడు వీరి జాతకాలు కలవలేదు.. వీరు విడిపోయే అవకాశం ఉందని చెప్పుకువచ్చారు. ఆయన అన్నట్లుగానే చైతు, సామ్ విడిపోయారు. విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వారు జీవిస్తున్నారు. ఇక అప్పటి నుంచి వేణు స్వామి వెలుగులోకి వచ్చారు. ఇక చాలా మంది సెలబ్రెటీలు ఆయన్నీ నమ్ముతారు.

పలువరు హీరోయిన్లు, హీరోలు.. వేణు స్వామితో పూజలు కూడా చేయించుకుంటారు. ఇక ఇదిలా ఉంటే.. గతంలో వేణు స్వామి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎన్నో సార్లు జోస్యం చెప్పారు. ఆయన జాతకం ఇక ముగిసిందంటూ... ప్రభాస్ ఏ సినిమాలు చేసినా అవి హిట్ కావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతే కాదు.. ప్రభాస్ కు పెళ్లి కూడా కలిసి రాదు.. ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటూ చెప్పుకువచ్చారు.
ప్రభాస్ తో ఏ దర్శక నిర్మాతలు సినిమా తీసిన నష్టాలు మూటగట్టుకోవాల్సిందే అంటూ గత ఇంటర్వ్యూల్లో వేణు స్వామి చెప్పుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా షోలో అర్ధరాత్రి నుంచే మొదలు అయ్యాయి.

సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి ప్రభాస్ యాక్టింగ్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్ కి ఫిదా అయిపోతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ అంటున్నారు. అంతే కాదు.. ఇక ఈ సినిమాతో ప్రభాస్ మరో బహుబలి రేంజ్ హిట్ ఖాయమని.. ప్రభాస్ ఇజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.

ప్రభాస్ సలార్ సినిమా మొదటి రోజు రూ.200 కోట్ల గ్రాస్ రాబట్టనుందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రూ.100 కోట్ల రూపాయల అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ అయ్యాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొత్తం మీద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ లెక్కతో ప్రభాస్.. వేణు స్వామి జోస్యాన్ని బ్రేక్ చేసినట్లు అని తెలుస్తోంది. చూాడలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











