»   » దీపావళి జరుపుకుంటున్న ప్రభాస్ (ఫొటో)

దీపావళి జరుపుకుంటున్న ప్రభాస్ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టాలీవుడ్‌ సినీ ప్రముఖులు బుధవారం అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. మరో ప్రక్క ప్రభాస్ తన ఇంటి వద్ద దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఆ ఫొటోని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఇక రామ్‌చరణ్‌, కాజల్‌ అగర్వాల్‌, సమంత, ప్రణీత, వరుణ్‌తేజ్‌, సునీల్‌, పూరీజగన్నాథ్‌, దేవిశ్రీప్రసాద్‌ తమ ఫేస్‌బుక్‌ ఖాతాల ద్వారా అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ప్రభాస్ కెరీర్, వివాహం విషయానికి వస్తే... ఈయేడాది చివర్లోగానీ, 2016 ప్రారంభంలోగానీ 'బాహుబలి 2'కి కొబ్బరికాయ్‌ కొడతారు. ఈ సినిమా కోసం ప్రభాస్‌ దాదాపు యేడాది కాల్షీట్లు కేటాయించవలసి వస్తుందని సమాచారం.

Prabhas celebrates Diwali photo

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాహుబలి చిత్రానికి సంబంధించి మిగిలి ఉన్న 30శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రభాస్ తన పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు.. భీమవరంలో ప్రభాస్‌కి ఓ పెళ్లిసంబంధం కుదిరిందని చెప్పుకొంటున్నారు.

మొత్తానికి ప్రభాస్‌ పెళ్లి కబురు అతి తొందర్లోనే వినబోతున్నామన్నమాట. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లాలో వుండే తన బంధువుల అమ్మాయిని మ్యారేజ్ చేసుకునేందుకు ప్రభాస్ ఓకే చేశాడని వార్తలు వెలువడుతున్నాయి.

అంటే ప్రభాస్‌ పెళ్లి 2016లోనూ లేకపోవచ్చు. అయితే సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం 2016 అక్టోబరులో ప్రభాస్‌ పెళ్లి చేయాలని ఇంట్లోవాళ్లు నిర్ణయించుకొన్నారని సమాచారం. 'బాహుబలి 2' షూటింగ్‌ పూర్తవ్వగానే ప్రభాస్‌ పెళ్లికొడుకు అవ్వడం ఖాయమని చెప్తున్నారు.

English summary
Prabhas play with firecrackers during Diwali celebrations
Please Wait while comments are loading...