»   »  ప్రభాస్ సంక్రాంతి సెలబ్రేషన్స్ (ఫోటోస్)

ప్రభాస్ సంక్రాంతి సెలబ్రేషన్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి స్టార్ ప్రభాస్ ఈ సారి సంక్రాంతి వేడుకలను ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. పెద నాన్న క్రిష్ణం రాజు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతికి సరదాగా గడిపారు. అందరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే...గత రెండు మూడేళ్లుగా ప్రభాస్ బాహుబలి ప్రాజెక్టుకే పూర్తిగా అంకితం అయిన సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన ‘బాహుబలి-ది బిగినింగ్' టాలీవుడ్ చరిత్రలోనే ఓ సెన్సేషన్ హిట్ అయింది. హిందీ, తమిళం, ఇతర భాషల్లోనూ విడుదలై సౌతిండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ప్రస్తుతం దానికి సీక్వెల్ ‘బాహుబలి-ది కంక్లూజన్' సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. మరో ఏడాది పాటు బాహుబలి సినిమా షూటింగులోనే పూర్తిగా గడుపబోతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం బాహుబలి షూటింగుకు సంక్రాంతి హాలిడే బ్రేక్ ఇవ్వడంతో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు వచ్చాడు.

స్లైడ్ షోలో ప్రభాస్ సంక్రాంతి వేడుకలకు సంబంధించిన ఫోటోలు...

ప్రభాస్

ప్రభాస్


ఈసారి సంక్రాంతి వేడుకలను ప్రభాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.

పండగ సంబరం

పండగ సంబరం


ఈ పండగకు ప్రభాస్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక చోట చేరి సెలబ్రేట్ చేసుకున్నారు.

హ్యాపీగా

హ్యాపీగా


సంక్రాంతి వేడుకల్లో ప్రభాస్ హ్యాపీగా గడిపారు.

బాహుబలి

బాహుబలి


మరో ఏడాది పాటు బాహుబలి సినిమా షూటింగులోనే పూర్తిగా గడుపబోతున్నాడు ప్రభాస్.

English summary
Baahubali star Prabhas celebrats Sankranthi fest with family members.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu