బృందావనం హిట్ ఇచ్చి రచయితకు ఛాన్స్ ఇచ్చిన రెబల్...!?
ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలన్నదే చాలామంది రచయితలకు లక్ష్యంగా వుంటుంది. తమ కథను తామే డైరెక్ట్ చేసుకుంటే ఎంతో బాగా తీయచ్చన్నది వాళ్ల నమ్మకం. అయితే, ఇలా దర్శకులుగా మారిన రచయితలలో సక్సెస్ అయింది మాత్రం ఒకటో ఆరో అనే చెప్పాలి. సరే... ఇక విషయానికొస్తే, తాజాగా మరో రచయిత వీళ్ల జాబితాలో చేరుతున్నాడు.
గతంలో భద్ర, మున్నా, బృందావనం చిత్రాలకు మాటలు రాసిన కొరటాల శివ త్వరలో డైరెక్టర్ అవ్వబోతున్నాడు. తనకున్న పరిచయంతో శివ ఇటీవల హీరో ప్రభాస్ కి ఓ కథ వినిపించాడనీ, ప్రభాస్ దానిని బాగా ఇష్టపడ్డాడనీ తెలుస్తోంది. 'తప్పకుండా చేద్దాం... స్క్రిప్ట్ పూర్తి చేసుకుని రా' అంటూ సదరు రచయితకు ప్రభాస్ ప్రామిస్ చేశాడట. ఆ ఆనందంలో శివ ఇప్పుడు స్క్రిప్టు పనిలో పడ్డాడు. స్క్రిప్ట్ వర్క్ ఓకే అయితే గనుక ఈ చిత్రాన్ని రతనవేలు సినిమాటోగ్రఫీ భాద్యతలు తీసుకుంటాడని, యున్ శంకర్ రాజా సంగీతాన్ని అందించనున్నాడని సమాచారం..
ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో 'రెబల్" షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సోషియో ఫ్యాంటసీ చిత్రం చేయనున్నారు. అది పూర్తి అవగానే శివ సినిమా చేయాలని ప్రభాస్ డిసైడ్ అయ్యడని సమాచారం.


Click it and Unblock the Notifications











