»   » రాజమౌళి ఆదేశం: ఆ సినిమా క్యాన్సిల్ చేసుకున్న ప్రభాస్!

రాజమౌళి ఆదేశం: ఆ సినిమా క్యాన్సిల్ చేసుకున్న ప్రభాస్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' ఫలితాలతో చాలా హ్యాపీగా ఉన్న ప్రభాస్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇన్నాళ్లు షూటింగ్, ప్రమోషన్లతో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం రిలాక్స్ అవుతున్నాడు. బాహుబలి-2 కంటే ముందు ప్రభాస్ ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ ఆ నిర్ణయం విరమించుకున్నట్లు తెలుస్తోంది.

‘రన్ రాజా రన్' ఫేం సుజీత్ ఆ మధ్య ప్రభాస్‌కి ఓ యాక్షన్ సబ్జెక్టుతో కూడిన కథ చెప్పి ప్రభాస్ నుండి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడు. వాస్తవానికి ‘బాహుబలి-ది బిగినింగ్' విడుదలైన వెంటనే...‘బాహుబలి-2' మొదలయ్యే గ్యాపులోసుజీత్ దర్శకత్వంలో మిర్చి నిర్మాతలతో ఈ యాక్షన్ ఎంటర్టెనర్ చేయాలనుకున్నాడు ప్రభాస్. ఆగస్టు నుండి ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది.


Prabhas changed his plans now

అయితే తాజాగా ప్రభాస్ ప్లాన్ మారినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నుండి ‘బాహుబలి-2' షూటింగ్ ఉంటుందని, రెడీగా ఉండాలని రాజమౌళి చెప్పడంతో సుజీత్‌తో చేయాల్సిన సినిమాను క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొదలు పెడితే ‘బాహుబలి-2' మొదలయ్యే సమయానికి అది పూర్తయ్యే అవకాశం లేక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

English summary
As per his earlier plan, Prabhas was to start a new action entertainer in the direction of Sujeeth for producers of 'Mirchi' from August. Sujeeth who shot to fame with 'Run Raja Run', narrated a story to Prabhas which he liked and had given his green signal. Before starting 'Baahubali 2', he wanted to wrap up this. But he has changed his plans now.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu