'డార్లింగ్' లో ప్రభాస్ క్యారెక్టర్ ఏమిటి?
ప్రభాస్ ను కలిసినప్పుడు మనమిద్దరం కలిసి ఓ మంచి లవ్ స్టోరీ చేద్దాం అన్నాడు. ఆ తర్వాత ఎనిమిది నెలలకు ప్రభాస్ ను కలిసి ఈ కథను వినిపించినప్పుడు తను ఎంతో ఎక్సైట్ అయ్యాడు. ఈ చిత్రంలోని ఎనభై శాతం సన్నివేశాలకు సమాజంలో జరిగిన వాస్తవ సంఘటనలే ప్రేరణగా నిలిచాయి అంటున్నారు కరణాకరన్. ఇక ప్రభాస్ పాత్ర గురించి చెబుతూ..బాధ్యత గల ప్రేమికుడిగా ప్రభాస్ ఈ చిత్రంలో కనిపిస్తాడు. తన ప్రేమని ఎలా గెలిపించు కున్నాడు..అనేది కొత్తగా వుంటుంది. చాక్లెట్ బాయ్ లా ఎంతో లవ్లీగా ప్రభాస్ ఈ చిత్రంలో కనిపిస్తాడు. ఎంటర్ టైన్ మెంట్ మిక్స్ అయిన ఈ పాత్రను ప్రభాస్ చాలా బాగా చేశాడన్నారు. ఇక టైటిల్ జస్టిఫికేషన్ గురించి చెబుతూ..ప్రేమతో పిలిచే 'డార్లింగ్' పిలుపులో ఎంతో అప్యాయత, అనురాగం వుంటుంది. ఎదుటి వ్యక్తి మీద వున్న ప్రేమను తెలియజేయటానికి ఇంతకు మించిన మంచి పదం లేదు. ఇక ఈ సినిమా కథాంశం ప్రేమకు సంబంధించినది కావడం, రియల్ లైఫ్ లో ప్రభాస్ కూడా తనకు నచ్చిన వ్యక్తిని 'డార్లింగ్' అని పిలవడం..ఇలా అన్ని విధాలుగా ఈ టైటిల్ సరిపోయింది అంటున్నారు కరుణాకరన్. ఇరవై మూడవ తేదీన డార్లింగ్ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆయన మీడియాని కలిసి మాట్లాడారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కాజల్ హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











