ప్రభాస్ డైలాగే సినిమా టైటిల్‌గా, ఎవరితో?
తాజాగా ఛత్రపతి సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగులోని 'ఒక్క అడుగు' అనే పదాన్ని ఫిల్మ్ టైటిల్ గా రిజిస్టర్ చేయించారు. ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు ఈ టైటిల్ రిజిస్టర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఇందులోని నిజానిజాలు, పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో 'బహుమలి' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో రాణా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రంలో వీరిద్దరి మధ్య కత్తియుద్ధం సన్ని వేశాలు ఉండనున్నాయి. ఈ మేరకు వీరిద్దరికి కత్తియుద్దంలో ట్రైనింగ్ ఇస్తున్నారు.
ఈ సినిమాను రాఘవేంద్రరావు సమర్పణలో శోబు ఆర్కా మీడియా బేనర్ పై భారీ బడ్జెట్ వెచ్చించి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ పని చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు.


Click it and Unblock the Notifications












