Radhe Shyam: పూజ హెగ్డేతో ముద్దు సీన్లు అందుకే చేశాను.. ఇబ్బంది అనిపించినా తప్పలేదు: ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ఈ సినిమా మార్చి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి విడుదల కావాలని చూస్తున్న ఈ సినిమాకు కరోనా చాలాసార్లు అడ్డు పడింది. ఫైనల్ గా సినిమాను అనుకున్న సమయానికి యు.వి.క్రియేషన్స్ ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయబోతోంది. ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్ పలు ఆసక్తికరమైన అంశాలపై ఓపెన్ గా వివరణ ఇస్తూ ఉండడం విశేషం. ముఖ్యంగా సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలపై అలాగే హీరోయిన్ పూజ తో ముద్దు సన్నివేశాలపై కూడా స్పందించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఇంతవరకు ఇలాంటి సినిమా రాలేదు..
బాహుబలి సాహో సినిమా లో అనంతరం ప్రభాస్ మంచి లవ్ స్టోరీ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాడు. మొత్తానికి రాధేశ్యామ్ సినిమాతో తను అనుకున్న కథను తెర పైకి తీసుకు రాబోతున్నట్లు వివరణ ఇచ్చాడు. ఒక విధంగా ఈ సినిమా ప్రేమ కథలలో చాలా విభిన్నమైన సినిమా అని ఇంతవరకు ఇలాంటి కంటెంట్ తో ఏ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు అని చెబుతున్నారు.

ట్రైలర్స్ తో మంచి రెస్పాన్స్
విధికి ప్రేమకు మధ్య లో జరిగే యుద్ధమే రాధేశ్యామ్ అని దర్శకుడు రాధాకృష్ణ మొదటి నుంచి సినిమాకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్స్ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. అంతేకాకుండా సినిమా లోని పాటలు అన్నీ కూడా యూట్యూబ్ లో అయితే భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్నాయి

ఇబ్బంది పడిన ప్రభాస్
ఈ సినిమాలో ప్రభాస్ పలు రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నటించాడు. లవ్ స్టోరీ సినిమా కాబట్టి ప్రేక్షకుడు అలాంటి సన్నివేశాలు ఉంటాయి అని ముందే ఒక అంచనాకు వస్తారు అని చెప్పవచ్చు. అయితే ప్రభాస్ మాత్రం యాక్షన్ అలాగే ఇతర డ్రామా సీన్లలో నటించినంత ఈజీగా రొమాంటిక్ సన్నివేశాల్లో ధైర్యంగా నటించ లేను అని చాలా సార్లు చెప్పాడు. ఇక ఈ సినిమాలో కూడా ఆ సన్నివేశాల్లో నటించడానికి కాస్త ఇబ్బంది పడినట్టు చెప్పాడు.

పూజా హెగ్డేతో ముద్దు సీన్లు
రాధేశ్యామ్ సినిమా లో లవ్ స్టోరీ కాబట్టి ముందుగానే దర్శకుడు కథపై ఒక క్లారిటీ ఇచ్చాడట. అయితే సినిమాకు ముద్దు సీన్లు రొమాంటిక్ సన్నివేశాలు అవసరం కాబట్టి చేయక తప్పలేదని ప్రభాస్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. కమర్షియల్ లవ్ స్టొరీ కాబట్టి ముందుగానే తనకు ఈ సినిమాపై క్లారిటీ ఉంది అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.
Recommended Video

అలాంటి సీన్స్ చేస్తే..
అయితే వీలైనంతవరకు రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి సెట్ లో చిత్ర యూనిట్ సభ్యులు ఎక్కువ మంది లేకుండా ఉండేలా చూసుకోమని దర్శకులకు చాలా సార్లు చెప్పినట్లు ప్రభాస్ చెప్పాడట. హీరోయిన్ ను ముద్దు పెట్టుకోవడానికి అలాగే చొక్కా విప్పడానికి కూడా తనకు సిగ్గు గా ఉంటుంది అని కూడా ఈ హీరో చెప్పుకొచ్చాడు. ఏదేమైనా కూడా ఈ సినిమాలోని పలు రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











