Adipurush తిరుపతిలోనే నా పెళ్లి.. మంచి అమ్మాయి కాబట్టే ఆమెతో.. పెళ్లిపై ప్రభాస్ క్లారిటీ
రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తోన్న అతడు.. ఆ మధ్య పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ 'ఆదిపురుష్' అనే సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇందులో అతడు తన పెళ్లిపై క్లారిటీ ఇవ్వడంతో పాటు చాలా విషయాలు మాట్లాడాడు. వివరాల్లోకి వెళ్తే....
ఆదిపురుష్‌గా వస్తున్నాడు:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బడా డైరెక్టర్ ఓం రౌత్ రూపకల్పనలో వస్తున్న చిత్రమే 'ఆదిపురుష్'. ఇందులో రెబెల్ స్టార్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటించారు. కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడి పాత్రను చేశారు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు.

గ్రాండ్‌గా మూవీ ఈవెంట్:రామాయణం నేపథ్యంతో వస్తున్న 'ఆదిపురుష్' మూవీని జూన్ 16వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలోని తారక రామ స్టేడియంలో నిర్వహించారు. దీనికి దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు వచ్చారు. ఫలితంగా ఈ ఈవెంట్ ఎంతో గ్రాండ్‌గా జరిగింది.
తొలిసారి అలాంటి స్పీచ్:సాధారణంగా ఏ ఫంక్షన్‌లోనూ పెద్దగా మాట్లాడని ప్రభాస్.. తాజాగా జరిగిన 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాత్రం బాగా ఓపెన్ అయ్యాడు. తండోపతండాలుగా తరలి వచ్చిన అభిమానులను చూసి ఉప్పొంగిపోయిన అతడు.. 'జై శ్రీరామ్' అంటూ స్పీచ్ మొదలెట్టాడు. తర్వాత ట్రైలర్ ఎలా ఉందని ఫ్యాన్స్‌ను అడిగి.. దీనికి ఓపెనింగ్స్ అదిరిపోతాయని చెప్పాడు.

8 నెలలు యుద్ధం చేశారు:ఈవెంట్‌లో ప్రభాస్ మాట్లాడుతూ.. 'ఏడు నెలల క్రితం ఓం రౌత్‌తో నా ఫ్యాన్స్‌కు ఒకసారి 3Dలో ట్రైలర్ వేయండి. వాళ్ల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం అన్నా. మీరు ఫస్ట్ టైమ్ చూసి ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్ అనేది మా టీమ్‌ను ఇప్పటిదాకా నడిపించింది. అందుకే ఫస్ట్ టైమ్ ఫ్యాన్సే చూడాలని అనుకున్నా. మీరు ఇచ్చిన రెస్పాన్స్‌తో వీళ్లు 8 నెలలు యుద్ధం చేశారు' అన్నాడు.
ఓం టీమ్‌కు హ్యాట్సాఫ్:ఆదిపురుష్ ఈవెంట్‌లో ప్రభాస్ కంటిన్యూ చేస్తూ.. 'హ్యాట్సాఫ్ టు ది ఓం టీమ్. నువ్వొక రాక్‌స్టార్‌వు. ఈ సినిమా విషయంలో తను చేసిన ఫైట్ నార్మల్ ఫైట్ కాదు. ఏడు నెలల నుంచి నిద్ర పోలేదు. టీ సిరీస్ నుంచి ఏడాదికి 20 సినిమాలు వస్తాయి. కానీ, నా పట్ల ఎమోషనల్‌గా తీసుకుని ప్రతిరోజూ కేర్ తీసుకున్నారు. వీళ్లందరితో పని చేయడం అదృష్టం' అని వివరించాడు.

చిరంజీవి గారు అన్నారు:ఇదే ఈవెంట్‌లో ప్రభాస్ కొనసాగిస్తూ.. 'ఒకసారి చిరంజీవి గారు ఒక మాట అడిగారు. ఆ మధ్య ఆయనను కలిసినపపుడు ఏంటి రామాయణం చేస్తున్నావా అని అడిగారు. నేను అవును సార్ అని అన్నాను. దీనికి ఆయన ఆ అదృష్టం అందరికీ దొరకదు. నీకు దొరికింది. ఆల్ ది బెస్ట్ అన్నారు. అవును.. ఈ సినిమాను చేయడం నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నాను' అని పేర్కొన్నాడు.
మంచి అమ్మాయి కాబట్టే:ఈ వేడుకలో హీరోయిన్ కృతి సనన్ గురించి వివరిస్తూ.. 'ఈ సినిమాలో సీత పాత్ర కోసం చాలా మంది హీరోయిన్లను అనుకున్నారు. కానీ, నిజంగా మంచి పేరు ఉన్న అమ్మాయినే పెట్టుకోవాలని అనుకున్నారు. అందుకే కృతిని తీసుకున్నారు. ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తోనే అందరినీ మెప్పించింది. ఆ పోస్టర్ చూడండి ఎంత బాగుందో. వెల్ డన్ కృతి' అంటూ ప్రభాస్ ప్రశంసించాడు.

పెళ్లిపైన ప్రభాస్ క్లారిటీ:ప్రభాస్ మాట్లాడుతున్నంత సేపు అతడి అభిమానులు 'డార్లింగ్ డార్లింగ్' అంటూ.. 'పెళ్లి ఎప్పుడు' అంటూ కేకలు వేశారు. అది విన్న అతడు.. స్పీచ్ ఆపేసి మరీ.. 'ఏంటి పెళ్లా? ఇక్కడే.. తిరుపతిలోనే చేసుకుంటాలే ఎప్పుడైనా' అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో అతడి ఫ్యాన్స్ అంతా గోల గోల చేశారు. ఇక, ఈ ఫంక్షన్‌కు వచ్చిన చిన్న జీయర్ స్వామికి, వైవీ సుబ్బారెడ్డికి, పోలీస్ అధికారులకు ప్రభాస్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు.


Click it and Unblock the Notifications











