ఆ విషయంలో అనుష్క చాలా వీక్.. అదే కాజల్ అయితే! ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Recommended Video

Prabhas Comments On Anushka Shetty And Kajal Aggarwal || Filmibeat Telugu

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి చూపు ప్రభాస్ హీరోగా రాబోతున్న సాహో పైనే ఉంది. మరో రెండు రోజుల్లో ఈ భారీ బడ్జెట్ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చర్చలన్నీ సాహో పైనే ఉన్నాయి. మరోవైపు భారీ సినిమా కావడంతో ఓ రేంజ్ ప్రమోషన్స్ చేస్తూ వస్తోంది చిత్రయూనిట్. దేశంలోని పలు నగరాల్లో ప్రెస్ మీట్స్ పెడుతూ సాహో పై ఇప్పటికే ఉన్న అంచనాలకు రెక్కలు కడుతోంది. హీరో ప్రభాస్ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అనుష్క, కాజల్ లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వివరాల్లోకి పోతే..

ప్రభాస్ ఎక్కడికెళ్లినా అదే మాట

ప్రభాస్ ఎక్కడికెళ్లినా అదే మాట

ప్రస్తుతం ప్రభాస్ ఎక్కడికెళ్లినా ఒకటే ప్రశ్న. అదే అనుష్కతో రిలేషన్. ఇటు ప్రభాస్, అటు అనుష్క ఈ విషయాలపై ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా జనం మదిలో ఆ రిలేషన్ తాలూకు అనుమానాలు మాత్రం పోవడం లేదు. ఈ నేపథ్యంలో తన కొత్త సినిమా ‘సాహో' ప్రమోషన్స్ లో అనుష్క గురించిన ప్రశ్నలే ఎక్కువగా ఎదుర్కొంటున్నారు ప్రభాస్.

ఈ సారి అనుష్కతో పాటు కాజల్ కూడా

ఈ సారి అనుష్కతో పాటు కాజల్ కూడా

ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ‘సాహో' ప్రమోషన్స్‌లో ప్రభాస్ పై మరిన్ని ప్రశ్నలు కురిపించారు మీడియా ప్రతినిథులు. ప్రభాస్ జంటగా రెండు సినిమాల్లో నటించింది కాజల్. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లో ఈ జోడీ అభిమానుల మనసు దోచుకుంది. దీంతో ఈ సారి ప్రభాస్‌కి అనుష్కతో పాటు కాజల్ కి సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురు కావడంతో ఆసక్తికర రిప్లై ఇచ్చారు ప్రభాస్.

కాజల్ డ్రెస్సింగ్‌సెన్స్ పై ప్రభాస్

కాజల్ డ్రెస్సింగ్‌సెన్స్ పై ప్రభాస్

కాజల్‌లో పాజిటివ్, నెగిటివ్ పాయింట్స్ ఏంటని ఓ మీడియా ప్రతినిథి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన ప్రభాస్.. అందం, ఎనర్జిటిక్ గా ఉండడం కాజల్ ప్లస్ పాయింట్స్ అన్నారు. ఒకప్పుడు కాజల్ డ్రెస్సింగ్‌సెన్స్ యావరేజ్‌గా ఉండేదని అదొక్కటే ఆమెలో నెగెటివ్ తప్ప ఇంకేమీ లేదని చెప్పారు.

ఆ విషయంలో అనుష్క చాలా వీక్

ఆ విషయంలో అనుష్క చాలా వీక్

ఇక మరోమారు అనుష్క ప్రశ్న ఎదురు కావడంతో ప్రభాస్ స్పందిస్తూ.. అనుష్క ఫోన్ లిఫ్ట్ చేయదని, తాను చేసినా కూడా లిఫ్ట్ చేయదని చెప్పారు. ఆ ఒక్క విషయంలోనే అనుష్క చాలా వీక్ అని చమత్కరించారు ప్రభాస్. అదేవిదంగా అనుష్కను లేడీ సూపర్ స్టార్, చాలా టాల్ అని పొగిడేశారు ప్రభాస్.

సాహో మూవీ

సాహో మూవీ

ఇక ప్రభాస్ సాహో సినిమా విషయానికొస్తే.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది సాహో. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా ఆగస్టు 30 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ద కపూర్ హీరోయిన్‌గా నటించింది. చిత్రంలో టైగర్ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X