For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వైఎస్ జగన్‌‌పై ప్రభాస్ సెన్సేషనల్ కామెంట్స్.. ఓ వైపు పృథ్వీ దుమారం రేగుతుండగానే ఇంతలో!

  |

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాక వైఎస్ జగన్‌ను సినిమా ఇండస్ట్రీ వారు ఎవ్వరూ మర్యాద పూర్వకంగా కలవక పోవడం, ఆయన్ను అభినందించక పోవడం చాలా బాధాకరమని నటుడు, ఎస్‌వీబీసీ చైర్మన్ పృథ్వీ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజేంద్రప్రసాద్ పై పృథ్వీ చేసిన కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇంతలో తాజాగా టాలీవుడ్ బడా హీరో ప్రభాస్.. వైఎస్ గురించి కొన్ని కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ జగన్ గురించి ప్రభాస్ ఎలా రియాక్ట్ అయ్యాడు? ఆయన చేసిన కామెంట్స్ ఏంటి? వివరాల్లోకి పోతే..

  భారీ రేంజ్‌లో సాహో.. ప్రభాస్ దూకుడు

  భారీ రేంజ్‌లో సాహో.. ప్రభాస్ దూకుడు

  గత సినిమా 'బాహుబలి' అందించిన విజయం ప్రభాస్ రేంజ్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. దీంతో తన తదుపరి సినిమా విషయంలోనూ అదే రేంజ్ మెయిన్‌టైన్ చేస్తూ ‘సాహో' పూర్తి చేశాడు ప్రభాస్. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మేరకు ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసి దూకుడుగా వెళ్తున్నాడు ప్రభాస్.

   చెన్నైలో అనుకోకుండా.. అలా

  చెన్నైలో అనుకోకుండా.. అలా

  సాహో ప్రమోయిన్స్ నిమిత్తమై తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఓ మీడియాతో ముచ్చటించిన ప్రభాస్.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఇంటర్వ్యూలో భాగంగా వైఎస్ జగన్ ప్రస్తావన తీసుకొచ్చిన యాంకర్, ఆయన పాలనపై మీ అభిప్రాయం ఏంటని అడిగాడు.

  రాజకీయాల పట్ల అవగాహన లేదంటూనే..

  రాజకీయాల పట్ల అవగాహన లేదంటూనే..

  దీంతో వెంటనే స్పందించిన ప్రభాస్.. రాజకీయాల పట్ల తనకు పెద్దగా అవగాహన లేదని అన్నాడు. కాకపోతే యంగ్ సీఎంగా ఆంధ్రప్రదేశ్‌ను జగన్ అభివృద్ధి పథంలో నడిస్తారనే నమ్మకమైతే ప్రజల్లో ఉందని చెప్పాడు. ప్రస్తుతం జగన్ బాగా పాలన బాగుందని ప్రభాస్ అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  సాహో అంటున్న వైసీపీ శ్రేణులు

  సాహో అంటున్న వైసీపీ శ్రేణులు

  తమ అభిమాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇలా రియాక్ట్ కావడం చూసి ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు వైసీపీ ఫ్యాన్స్. సాహో ప్రభాస్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. సాహో సూపర్ డూపర్ హిట్ ఖాయం అంటూ ప్రభాస్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ రకంగా ప్రభాస్ సాహోకి మంచి సపోర్ట్ లభించిందని చెప్పుకోవచ్చు.

  సాహో మూవీ

  సాహో మూవీ

  యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై 350 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది సాహో సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. హీరోయిన్ శ్రద్ద కపూర్‌కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. ఈ సినిమా ఆగస్టు 30వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల కానుంది.

  English summary
  After Bahubali Young rebal star Prabhas new movie is Saaho. This movie is directed by sujeeth. The shooting is successfully completed. In this movie promotions Prabhas intresting comments on jagan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X