Rakesh Master గురించి ప్రభాస్ చెప్పిన మాటలు వింటే కన్నీళ్ళు ఆగవు.. నెంబర్ వన్ స్టార్ మొదటి గురువుగా..

సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న రాకేష్ మాస్టర్ అంటే ఈ తరంలోని కొంతమంది జనరేషన్ వాళ్లకు అంతగా తెలియకపోవచ్చు. ఆయన సినిమా ఇండస్ట్రీకి కాస్త దూరమైన తర్వాత ఎక్కువగా సోషల్ మీడియాలో మీమ్స్ ద్వారానే వైరల్ అయ్యారు. అయితే ఆయన గొప్పతనం గురించి మాత్రం ఇప్పుడిప్పుడే చాలామందికి తెలుస్తోంది. ఇక రాకేష్ మాస్టర్ గురించి ప్రభాస్ మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

అవకాశాలు తగ్గడంతో అలా..:రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఏ స్థాయిలో గుర్తింపు అందుకున్నారో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు. కొన్నాళ్ల తర్వాత అవకాశాలు తగ్గడంతో రాకేష్ మాస్టర్ చాలా వరకు మద్యానికి బానిసయ్యారు. వివిధ రకాల కారణాల వలన కూడా ఆయన మనస్థాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఎక్కువగా బాధను తట్టుకోలేకనే ఆయన మధ్యానికి అలవాటు పడాల్సి వచ్చింది అని అతని సన్నిహితులు తెలియజేశారు.

Prabhas comments on Dance choreographer Rakesh Master video viral

ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన తరువాత..:యూట్యూబ్ ఛానల్ ద్వారా రెగ్యులర్ గా కనిపిస్తూ వచ్చిన రాకేష్ మాస్టర్ కొన్నిసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే తాను ఏం మాట్లాడినా కూడా అబద్ధాలు చెప్పనని నిజాలు మాత్రమే చెబుతాను అని ఇండస్ట్రీలో ఉన్న అందరి గురించి నాకు తెలుసు అని ఇంటర్వ్యూలలో మాట్లాడారు. పలుసార్లు ఓ వర్గం స్టార్ హీరోల అభిమానులు కూడా రాకేష్ మాస్టర్ పై సీరియస్ అయ్యారు. అయినప్పటికీ కూడా ఆయన ఆ తర్వాత మళ్లీ ఫ్యాన్స్ తో మాట్లాడి అందరిని కూడా ఏకం చేసి ఫ్రెండ్లీగా ఉండాలి అని కూడా వీడియోలు విడుదల చేశారు.

Prabhas comments on Dance choreographer Rakesh Master video viral

వారికి గురువుగా రాకేష్ మాస్టర్:ఇక రాకేష్ మాస్టర్ మరణించిన రోజు ఆయన గొప్పతనం ఏమిటో అందరికీ అర్థమైంది. ఆయన ఒకప్పుడు జానీ మాస్టర్ అలాగే శేఖర్ మాస్టర్ లకు డాన్స్ నేర్పిన వారే. వాళ్ళు రాకేష్ మాస్టర్ తరఫునుంచి ఇండస్ట్రీలోకి వారు అడుగు పెట్టారు అని అందరికీ తెలిసిందే. అంతేకాకుండా కొంతమంది స్టార్ హీరోలకు కూడా రాకేష్ మాస్టర్ ప్రత్యేకంగా డాన్స్ నేర్పారు పర్సనల్ గా వాళ్ళ ఇంటికి వెళ్లి మరి డాన్స్ మాస్టర్ గా ఆయన కొన్నాళ్లు గడిపారు.

రాకేష్ మాస్టర్ పై ప్రభాస్ కామెంట్స్:

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో రాకేష్ మాస్టర్ కు సంబంధించిన అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఒకప్పుడు ఢీ షోలో ప్రత్యేక అతిథిగా వచ్చిన ప్రభాస్ రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడారు. మొదట్లో ఇండస్ట్రీలోకి రాకముందు తనకు డాన్స్ ఏమి రాదు అని అందులో వన్ టూ త్రీ స్టెప్స్ అనేవి ఉంటాయని కూడా నాకు తెలియదు అని, అయితే అవన్నీ రావడానికి ముఖ్య కారణం రాకేష్ మాస్టర్ అలాగే శేఖర్ మాస్టర్ అని తెలియజేశారు. ఈ గురు శిష్యులు ఇద్దరు కూడా తనకు ప్రత్యేకంగా డాన్స్ నేర్పించారు అని ప్రభాస్ వారిని గురించి గొప్పగా మాట్లాడారు. ఇక ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X