ప్రభాస్ చేతిలో 37 కార్లు ధ్వంసం.. అబుదాబీలో తుక్కుతుక్కుగా..

By Rajababu

Recommended Video

Prabhas Hits 37 Cars For An Action Sequence In Saaho

బాహుబలి సంచలన విజయం తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం అబుదాబిలో యాక్షన్ పార్టు పూర్తి చేసుకోబోతున్నది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్లను హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా తెరకెక్కిస్తున్నారు. ఫైట్స్ రియల్టిక్‌గా ఉండేందుకు కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించకుండా రియల్‌గానే షూట్ చేయడం గమనార్హం. సాహో కోసం ఫైట్స్ తీస్తున్న ఫైట్స్ అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ చర్చనీయాంశమయ్యాయి.

37 కార్లు తుక్కుతుక్కు

37 కార్లు తుక్కుతుక్కు

సాహో ఫైట్స్ సీన్లలో భాగంగా ప్రభాస్ పలు కార్లను తుక్కుతుక్కు చేసేశాడట. షూటింగ్‌లో భాగంగా ఒకటి కాదు ఏకంగా 37 కార్లను యంగ్ రెబల్ స్టార్ ధ్వంసం చేసినట్టు బాలీవుడ్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

ప్రభాస్ ఏం చెప్పారంటే

ప్రభాస్ ఏం చెప్పారంటే

కార్ల ధ్వంసాన్ని ఖర్చుకు వెనుకాడకుండా, గ్రాఫిక్స్‌ను ఉపయోగించకుండా షూట్ చేయడంపై ప్రభాస్ మాట్లాడుతూ.. సినిమా కోసం ముందుగానే ఇలానే ఫైట్స్ షూట్ చేయాలని అనుకొన్నాం. ఆ క్రమంలోనే రెండేళ్ల క్రితం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్నీ బేట్స్‌ను సంప్రదించాం. ప్రతీది యాక్షన్ పార్టును లైవ్‌గానే షూట్ చేయాలని నిర్ణయించాం. షూటింగ్‌లో రియల్ కార్లను ఉపయోగించాం. గాల్లో కార్లు పల్టీలు కొట్టడం ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుంది అని ప్రభాస్ అన్నారు.

ప్రభాస్ సూపర్ బైక్ విన్యాసాలు

ప్రభాస్ సూపర్ బైక్ విన్యాసాలు

సాధారణంగా యాక్షన్ సీన్ల కోసం 70 శాతం కంప్యూటర్ గ్రాఫిక్స్, 30 శాతం రియల్‌గా చిత్రీకరిస్తాం. కానీ అబుదాబీలో షూట్ చేసిన పార్ట్‌లో వందశాతం రియలిస్టిక్‌గా చిత్రీకరించాం అని ప్రభాస్ తెలిపారు. ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ బైక్‌ను ఉపయోగిస్తున్నారట. ఆయన చేసే విన్యాసాలు ప్రేక్షకులను అబ్బురపరుస్తాయని చిత్ర యూనిట్ పేర్కొంటున్నారు.

స్టయిలీష్ థ్రిల్లర్‌గా సాహో

స్టయిలీష్ థ్రిల్లర్‌గా సాహో

కనీవిని ఎరుగని రీతిలో సాహో చిత్రం చక్కటి స్టయిలీష్ థ్రిల్లర్‌గా రూపొందనున్నదనే చిత్ర యూనిట్ ధీమాను వ్యక్తం చేస్తున్నది. ఈ పోరాట సన్నివేశాల్లో నీల్ నితిన్ ముఖేష్, శ్రద్ధాకపూర్ పాల్గొన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు జాకీ ష్రాఫ్, మందిరాబేడి తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X