వావ్ 1 మిలియన్, కేక పుట్టించిన ప్రభాస్ (ఫోటోలు)
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూడు నెలల క్రితం ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పేస్ బుక్‌లో ప్రభాస్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య 1 మిలియన్ మార్కను దాటేసింది. అకౌంట్ ఓపెన్ చేసిన వంద రోజుల్లోపే ప్రభాస్ 1 మిలియన్ మార్కును అందుకోవడం గమనార్హం.
ప్రస్తుతం ప్రభాస్ 'బాహుబలి'చిత్రంలో నటిస్తున్నాడు. ప్రభాస్, అనుష్క, రాణా, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా 'బాహుబలి' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు.

బాహుబలి షూటింగులో..
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే ‘ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.

రానాతో కలిసి..
బాహుబలి చిత్రంలో రానా, ప్రభాస్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. సినిమా మొత్తం వీరిద్దరి చుట్టూనే తిరుగుతుంది. రానా ఇందులో నెగెటివ్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు.

గణతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
తన ఫేస్ బుక్ ఫాలోవర్స్‌కు, అభిమానులకు గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ప్రభాస్ ఇలా చెప్పారు...

అదరిపోయే స్టైల్..
ప్రభాస్‌ను ఫాలో అయ్యే వారిలో యూతే అధికం. ఆయన స్టైల్‌ను ఫాలో అయ్యే అభిమానులు బోలెడు.

ఫ్యామిలీతో...
ఇటీవల జరిగిన కృష్ణం రాజు పుట్టినరోజు వేడుక సందర్భంగా ఫ్యామిలీతో కలిసి ప్రభాస్...


Click it and Unblock the Notifications











