twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ 'డార్లింగ్' రిలీజ్ డేట్ ఎప్పుడంటే...

    By Srikanya
    |

    ప్రభాస్, కాజల్ కాంబినేషన్ లో కరుణాకరణ్ దర్శకత్వం వహిస్తున్న 'డార్లింగ్' చిత్రం టాకీ పూర్తయింది. ఈ సందర్భంగా మీడియాకు ఈ చిత్ర విశేషాలు తెలుపుతూ రిలీజ్ డేట్ చెప్పారు నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌. ఆయన మాటల్లోనే 'మా చిత్రం ప్రారంభం నుంచి నెలరోజులపాటు ట్విన్‌సిటీస్‌లోని వివిద ప్రాంతాలలో నిరవధికంగా షూటింగ్‌ జరిపాం. ఆ తర్వాత అరకులో ఆరంభించాం. దాంతో టాకీ పూర్తయింది. ఇంకా రెండు పాటలు, కొంత యాక్షన్‌ పార్ట్‌ బ్యాలెన్స్‌ ఉంది. ఫిబ్రవరి 15నాటికి నిర్మాణం పూర్తవుతుంది. ఏప్రిల్‌ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది' అని తెలిపారు.

    అనంతరం దర్శకుడు కరుణాకరణ్ మాట్లాడుతూ..'జి.వి.ప్రకాష్‌ చక్కటి ట్యూన్స్‌ ఇచ్చాడు. మ్యూజికల్‌గా శ్రద్ధ తీసుకున్నాం. ఈ చిత్రంలో ప్రభాస్‌ కొత్తగా కన్పిస్తాడు. లవ్‌, యాక్షన్‌, సెంటిమెంట్‌ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రభాస్‌ అభిమానులు ఆశించిన స్థాయిలో ఈ చిత్రముంటుంది' అని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియాప్రై.లిమిటెడ్‌ పతాకంపై రూపొందుతోంది. ఈ చిత్రానికి కెమెరా: ఆండ్రూ, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు.ఇంతకు ముందు కరుణాకరన్ దర్శకత్వంలో తొలి ప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా, యువకుడు, వాసు తదితర చిత్రాలు వచ్చాయి. ప్రభాస్ ఏక్ నిరంజన్ అనంతరం చేస్తున్న చిత్రం ఇది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X