Don't Miss!
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్నBird Flu పాలు, గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రభాస్ 'డార్లింగ్' రిలీజ్ డేట్ ఎప్పుడంటే...
ప్రభాస్, కాజల్ కాంబినేషన్ లో కరుణాకరణ్ దర్శకత్వం వహిస్తున్న 'డార్లింగ్' చిత్రం టాకీ పూర్తయింది. ఈ సందర్భంగా మీడియాకు ఈ చిత్ర విశేషాలు తెలుపుతూ రిలీజ్ డేట్ చెప్పారు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్. ఆయన మాటల్లోనే 'మా చిత్రం ప్రారంభం నుంచి నెలరోజులపాటు ట్విన్సిటీస్లోని వివిద ప్రాంతాలలో నిరవధికంగా షూటింగ్ జరిపాం. ఆ తర్వాత అరకులో ఆరంభించాం. దాంతో టాకీ పూర్తయింది. ఇంకా రెండు పాటలు, కొంత యాక్షన్ పార్ట్ బ్యాలెన్స్ ఉంది. ఫిబ్రవరి 15నాటికి నిర్మాణం పూర్తవుతుంది. ఏప్రిల్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది' అని తెలిపారు.
అనంతరం దర్శకుడు కరుణాకరణ్ మాట్లాడుతూ..'జి.వి.ప్రకాష్ చక్కటి ట్యూన్స్ ఇచ్చాడు. మ్యూజికల్‌గా శ్రద్ధ తీసుకున్నాం. ఈ చిత్రంలో ప్రభాస్ కొత్తగా కన్పిస్తాడు. లవ్, యాక్షన్, సెంటిమెంట్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రభాస్ అభిమానులు ఆశించిన స్థాయిలో ఈ చిత్రముంటుంది' అని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియాప్రై.లిమిటెడ్ పతాకంపై రూపొందుతోంది. ఈ చిత్రానికి కెమెరా: ఆండ్రూ, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు.ఇంతకు ముందు కరుణాకరన్ దర్శకత్వంలో తొలి ప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా, యువకుడు, వాసు తదితర చిత్రాలు వచ్చాయి. ప్రభాస్ ఏక్ నిరంజన్ అనంతరం చేస్తున్న చిత్రం ఇది.