ప్రభాస్ 'డార్లింగ్' రిలీజ్ ఎప్పుడంటే...
ప్రభాస్, కాజల్ కాంబినేషన్లో రూపొందిన 'డార్లింగ్' ఈ నెల 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. హీరో ప్రభాస్ మాట్లాడుతూ... "కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన తొలిప్రేమ, ఉల్లాసంగా-ఉత్సాహంగా సినిమాలను చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యాను. అప్పట్నుంచి నాకిష్టమైన దర్శకుల లిస్ట్‌లో అతను కూడా చేరాడు. ఇక 'డార్లింగ్' సినిమా విషయానికొస్తే... నన్నెంతో ఇన్‌స్పైర్ చేసిన కథాంశంతో రూపొందిన చిత్రమిది. ప్రేమ, కుటుంబ విలువలు, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ ఇందులో ఉంటాయి' అన్నారు.
తమిళ నటుడు ప్రభు ఓ కీలక పాత్రలో చేసిన ఈ చిత్రంలో ధర్మవరపు సుబ్రమణ్యం, ఎమ్మెస్ నారాయణ, ఆహుతి ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, ప్రభాస్ శీను, రాజాశ్రీధర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. మాటలు: స్వామి, సంగీతం: జీవీప్రకాష్, కెమెరా: ఆండ్రూ, పాటలు: అనంతశ్రీరామ్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, కళ: అశోక్, నృత్యాలు: కల్యాణ్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రేమ, యాక్షన్‌లు మిళితమైన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.


Click it and Unblock the Notifications











