23న ప్రభాస్ కెరీర్ లోనే అత్యధికంగా...
ప్రభాస్ కెరీర్‌లోనే అత్యధిక ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా 'డార్లింగ్' చిత్రాన్ని విడుదల చేయనున్నాం అంటున్నారు నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్. తొలిప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి ప్రేమకథలను రూపొందించిన కరుణాకరన్ ని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియచేయటానికి నిర్మాత మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆయన మాటల్లోనే..."కరుణాకరన్ శైలిలో సాగే మంచి ఫీల్ ఉన్న ప్రేమకథ ఇది. ఇందులో ప్రేమ, కుటుంబ విలువలు, భావోద్వేగాలు, యాక్షన్ అన్నీ ఉంటాయి. ప్రభాస్ నటన, కరుణాకరన్ దర్శకత్వ ప్రతిభ, కాజల్ గ్లామర్ ఈ సినిమాకు హైలైట్స్. అటు టేకింగ్ పరంగా, ఇటు మేకింగ్ పరంగా సినిమా రిచ్ గా ఉంటుంది. ఇటీవల విడుదలైన పాటలకు అద్భుతమైన అప్లాజ్ వస్తోంది అన్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా కాజల్ నటించారు. అలాగే ప్రబాస్ తో గతంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ 'ఛత్రపతి' చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. తమిళ హీరో ప్రభు ప్రత్యేక పాత్ర చేసిన ఈ చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, ఆహుతి ప్రసాద్, శ్రీనివాసరెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: స్వామి, కెమెరా: ఆండ్రూ, ఆర్ట్: అశోక్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: జి.వి.ప్రకాష్, నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ప్రై.లిమిటెడ్.


Click it and Unblock the Notifications











