Kalki 2898 AD స్టార్స్ రెమ్యునరేషన్స్ ఎంతంటే? అమితాబ్, కమల్, దీపిక, దిశపటానీకి ఎన్ని కోట్లు కుమ్మరించారంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 భారత దేశంలోనే అత్యంత కాస్ట్లీయెస్ట్ మూవీగా తెరకెక్కిన విషయం తెలిసిందే. మరి ఇంత ఖరీదైన సినిమాల్లో నటించిన దిగ్గజ నటీనటులు ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటివారు ఈ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా? ఆ ఇంట్రెస్టింగ్ విషయంపై ఒక లుక్కేద్దాం.
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ కల్కి 2898 ఏడీ. ఈ మూవీ జూన్ 27న థియేటర్లలోకి రాబోతోంది. రిలీజ్ కు ఇంకా వారం రోజులు కూడా లేకపోవడంతో ఈ సినిమా గురించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో దిగ్గజ నటీనటులు నటించిన విషయం తెలిసిందే.

అయితే వాళ్లు ఒక్కొక్కరు ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారు అనే ఆసక్తికరమైన వార్త తాజాగా బయటకు వచ్చింది. మరి సినిమాలో నటించిన ఏ స్టార్ ఎంత పారితోషకం తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రెమ్యూనరేషన్ అనగానే ఇందులో హీరోగా నటించిన ప్రభాస్ గురించే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్ హీరోల్లో ఒకరు.
కల్కి 2898 ఏడి కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రూపాయలు పారితోషికంగా గా అందుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత స్థానంలో దీపికా పదుకొనే ఉండడం విశేషం. ఈ బ్యూటీ నిన్న మొన్నటిదాకా ఒక్కో సినిమాకు 10 కోట్లు డిమాండ్ చేసింది.

కానీ కల్కి మూవీలో హీరోయిన్ గా నటించినందుకు ఆమె అకౌంట్ లో ఏకంగా 20 కోట్లు రెమ్యునరేషన్ గా వేశారట మేకర్స్. ఆమె ఇటీవలే ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఇండియాలోనే హైయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా దీపికా పదుకొనే టాప్ ప్లేస్ లోకి వచ్చేసింది.
నెంబర్ వన్ ప్లేస్ లో ప్రస్తుతానికి సాయి పల్లవి ఉంది. ఆమె రామాయణం మూవీకి 50 కోట్లు పారితోషికంగా తీసుకుంటుందని రూమర్లు ఉన్నాయి. కాబట్టి 20 కోట్లతో దీపికా రెండో స్థానంలో ఉందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఈ సినిమాలో మిగిలిన ప్రధాన తారాగణం అనగానే బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని గుర్తొస్తారు.

కమల్, అమితాబ్ ఒక్కొక్కరు ఈ మూవీకి 20 కోట్ల పారితోషికం అందుకున్నారని సమాచారం. కమల్ హాసన్‌కు 50 కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చారని తెలిసింది. మరో హీరోయిన్ గా నటించిన దిశా పటాని 5 కోట్లు పారితోషికం తీసుకుందట. దీంతో ఓన్లీ నటీనటులకు పారితోషికం ఇవ్వడానికే ఏకంగా 250 కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలుస్తోంది.
ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ వర్క్ కోసం కూడా భారీగానే ఖర్చయ్యింది. మొత్తంగా ఈ మూవీ బడ్జెట్ 600 కోట్ల రూపాయలు. ఇక వసూళ్లు కూడా అదే స్థాయిలో వస్తేనే నిర్మాతలు సేఫ్ అవుతారు.


Click it and Unblock the Notifications











