»   » భీమవరం పెళ్లి సంబంధం గురించి ప్రభాస్ వివరణ

భీమవరం పెళ్లి సంబంధం గురించి ప్రభాస్ వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి సినిమా పూర్తవగానే ప్రభాస్‌కు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు ఆ మధ్య ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాహుబలి ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై స్పందించారు. తనకు భీమవరం సంబంధం కుదిరిందనే విషయ వాస్తవం కాదన్నారు.

ఇంట్లో వాళ్లు ఇంకా తనకు ఇంకా సంబంధాలు చూడటం మొదలు పెట్టలేదని, బాహుబలి పూర్తయ్యాక కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని, ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తా. అమ్మాయిలపై నా ఇష్టాలు సీజన్ ను బట్టి మారిపోతుంటాయి, రెండేళ్ల క్రితం వరకు బాగా మాట్లాడే అమ్మాయిలు నచ్చేవారు. ఇపుడు ఎలాంటి అమ్మాయిల్ని ఇష్టపడతానో నాకే తెలియడం లేదు అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చారు.


Prabhas Denied marriage Rumors

బాహుబలి సినిమాతో నేను నెం.1 అయిపోతానని అనుకోవడం లేదను, ఆ స్థానం గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు, అభిమానులకు మంచి సినిమా చూపించాలనే కోరిక తప్ప మరో ఆలోచన ఉండదు. బాహుబలి వారిని నూటికి రెండొందలశాతం సంతృప్తి పరుస్తుంది. మంచి కథలెప్పుడూ ఓడిపోవని నా నమ్మం అన్నారు.


బాహుబలి లాంటి సినిమా జీవితంలో ఒక్కసారే చేస్తాం. అందుకే ఎంత సమయం అయినా ఇవ్వడానికి వెనకాడలేదు. బాహుబలి సినిమాను ఒక యజ్ఞంలా చేసాం. ఈ మూడేళ్ల కాలంలో కుటుంబాన్ని మిస్సయిన ఫీలింగ్ ఏ మాత్రం కలగలేదు. ఎందుకంటే రాజమౌళి కుటుంబం నాకుటుంబం లాంటిదే. ఒక సినిమా కోసం ఇన్నేళ్లు కష్టపడాలా అని ఎప్పుడూ ఆలోచించలేదు. రిస్క్ అనే ఫీలింగే రాలేదు అన్నారు.

English summary
Tollywood actor Prabhas Denied marriage Rumors.
Please Wait while comments are loading...