»   » అనుష్కతో పెళ్లి వార్తలు హల్ చల్: ప్రభాస్ స్పందన

అనుష్కతో పెళ్లి వార్తలు హల్ చల్: ప్రభాస్ స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu
Prabhas Clears Rumours Of His Link Up with Anushka పెళ్లి వార్తల పై ప్రభాస్ స్పందన

హీరో ప్రభాస్‌, హీరోయిన్‌ అనుష్క ప్రేమలో ఉన్నారని, డిసెంబరులో వీరి నిశ్చితార్థం జరగబోతోందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. గతంలోనూ ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చినపుడు ప్రభాస్ ఖండించారు.

తాజాగా ఉమర్ సంధు అనే సినిమా రివ్యూలు రాసే ఓ వ్యక్తి ప్రభాస్, అనుష్క మధ్య రిలేషన్ నిజమే అని, త్వరలో ఇద్దరూ పెళ్లాడబోతున్నారని, డిసెంబర్లో నిశ్చితార్థం జరుగబోతోందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టడంతో...... ఇది నిజమే అని అంతా నమ్మారు.

ప్రభాస్ స్పందన

ప్రభాస్ స్పందన

అయితే ఈ వార్తలపై ప్రభాస్ తరుపున ఆయన ప్రతినిధులు స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని, తప్పుడు వార్తలే అని తెలిపారు.

అలాంటి అవసరం లేదు

అలాంటి అవసరం లేదు

నిజంగా ప్రభాస్‌, అనుష్కల మధ్య అలాంటిదేమైనా ఉంటే రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని, ఆ విషయాన్ని వారే స్వయంగా ప్రకటిస్తారని చెప్పారు. అంతేకానీ వారికి సంబంధం లేని వారు సోషల్‌మీడియా ద్వారా ప్రకటించడం లాంటివి జరుగదని తెలిపారు.

ఎందుకు ఇలా?

ఎందుకు ఇలా?

ప్రభాస్, అనుష్క ఇద్దరూ పెళ్లి విషయంలో దూరంగా ఉంటుండటం, ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండటంతో ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని చాలా మంది అపోహ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి వార్తలు తెరపైకి వస్తున్నాయి.

బిజీ బిజీ

బిజీ బిజీ

ప్రస్తుతం ప్రభాస్, అనుష్క ఎవరి సినిమాల్లో వారు బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రభాస్‌ ‘సాహో' చిత్రంలో నటిస్తుంగా, అనుష్క ‘భాగమతి' చిత్రం చేస్తోంది. ఈ ఇద్దరూ కలిసి ‘బిల్లా', ‘మిర్చి', ‘బాహుబలి', ‘బాహుబలి 2' చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

English summary
'Baahubali' sensation Prabhas shrugs off rumours of marriage and dating co-star Anushka Shetty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu