ప్లాపైనా... సీక్వెల్‌కి ప్రభాస్ ఓకే(అఫీషియల్)
ప్రభాష్ హీరోగా వచ్చిన 'బిల్లా' చిత్రం ఆ మధ్య భారీ బడ్జెట్‌తో రూపొంది పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన బిల్లా చిత్రాన్ని తెలుగులో ప్రభాస్ హీరోగా అదే పేరుతో మెహర్ రమేష్ దర్శకత్వంలో రీమేక్ చేశారు. అయితే అందులో ప్రభాస్ యాక్షన్ సీన్లలో అదరగొట్టినా...అనుష్క, నమిత భారీగా అందాలు ఆరబోసినా ఎందుకో తెలుగు ప్రేక్షకులకు ఎక్కలేదు.
ఆ సినిమా ప్లాపయినా సరే...దానికి సీక్వెల్‌లో నటించడానికి ఓకే చెప్పాడు ప్రభాస్. ఈ విషయం అఫీషియల్‌గా వెల్లడయింది. 'బిల్లా' చిత్రాన్ని నిర్మించిన ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ 'బిల్లా'కు సీక్వెల్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. అజిత్ కథానాయకుడిగా 'బిల్లా' చిత్రానికి సీక్వెల్‌గా తమిళంలో ఆ మధ్యన 'బిల్లా2' విడుదలైన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్‌తో చేయబోయే తెలుగు సీక్వెల్ పూర్తి విభిన్నంగా వుంటుందని, తమిళ బిల్లా2 చిత్ర కథకు ఎలాంటి సంబంధం వుండబోదని ఫిల్మ్ నగర్ టాక్.
ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది ఇంకా నిర్ణయం కాలేదు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ప్లాపయినా సరే ఈ సినిమాకు సీక్వెల్ తీయడానికి ఓబలమైన కారణం ఉంది. అప్పుడు సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడంతో పాటు, బిల్లా సినిమాలో ప్రభాస్ పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులే పడ్డప్పటికీ ....వినోదం పాళ్లు తక్కువగా ఉండటమే సినిమా పరాజయానికి కారణం అయిందని అంటున్నారు. అందుకే ఈ సారి అభిమానుల అభిరుచికి తగిన విధంగా సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం రెబల్ చిత్రంలో నటిస్తున్నాడు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. దీంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో 'వారధి' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత ప్రేక్షకులు, అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రభాస్- రాజమౌళి కాంబినేషన్ మొదలు కానుంది.


Click it and Unblock the Notifications











