రూ. 5 లక్షల విరాళం అందించిన ప్రభాస్

By Bojja Kumar

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. జీసస్ ఓల్డేజ్ హోం కోసం రూ. 5 లక్షల విరాళం అందించారు. ఈ మేరకు ఆయన తన ఆంధ్రబ్యాంక్ అకౌంట్ నుండి రూ. 5 లక్షల చెక్కు అందజేసారు. ఈ చెక్కుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు.

Prabhas donate 5 lakhs

ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ఇటీవలే ‘బాహుబలి' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్, త్వరలో ప్రారంభం కాబోయే ‘బాహుబలి-2' షూటింగుకు సిద్ధమవుతున్నాడు. తన పాత్రకు తగిన విధంగా శరీరాకృతిని మలుచుకునేందుకు కసరత్తులు చేస్తున్నాడు.

prabhas

‘బాహుబలి--2' దర్శకుడు రాజమౌళి అండ్ టీం ప్రీ ప్రొడక్షన్ పనుల మీద బిజీగా గడుపుతున్నారు. డిసెంబర్ 14 నుండి షూటింగ్ మొదలు కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగుకు సంబంధించిన సెట్టింగ్స్ రెడీ అవుతున్నాయి.

బాహుబలి పార్ట్ 1 విజయం అందించిన ఉత్సాహంతో రాజమౌళి అండ్ టీం సెకండ్ పార్ట్ ను మరింత అద్భుతంగా తీయాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. సెకండ్ పార్ట్ ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఉంటుందని, గతంలో ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని అనుభూతి ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు పొందుతారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X