ఇప్పుడు ఆయన ప్రభాస్ కాదు....ప్రభంజనం!
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రమ క్రమంగా తన రేంజి పెంచుకుంటున్నాడు. పరిశ్రమలో అగ్రస్థానికి చేరాలంటే ఒక్కొక్కమొట్టు ఎక్కాలన్న ప్రాథమిక సూత్రాన్ని మరిచిపోకుండా పక్కాప్లానింగుతో తన సినీ భవిష్యత్‌కు బాటలు వేసుకుంటున్నాడు. ఈశ్వర్‌తో తెరంగ్రేటం చేసి వర్షం, చత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగిన ప్రభాస్....ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' చిత్రం చేస్తున్నారు.
అయితే ప్రభాస్ గురించిన ఓ విషయం చెబితే ఆయన ప్రభాస్ కాదు....ప్రభంజనం అని మీరే ఒప్పుకుంటారు. ఇటీవలే ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన ప్రభాస్‍కు వారం తిరిగేలోపే 3 లక్షల ఫాలోవర్స్ పేజ్ లైక్ చేసారు. మరి ఒక నెల రోజులు గడిస్తే ఈ లెక్క ఎంత వరకు చేరుతుందో చూడాలి.
ప్రభాస్‌కు యూత్‌లో భారీ ఫాలోయింగ్ ఉందని ఇప్పటికే పలు సర్వేల్లో రుజువైంది. కానీ అది ఈ రేంజిలో ఉందని ఆయన ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేస్తే గానీ స్పష్టం కాలేదు. మరో వైపు 'బాహుబలి' మేకింగ్ వీడియోకు కూడా ఒక రోజులోనే 3 లక్షల పైచిలుకు హిట్స్ వచ్చాయి. మరి బాహుబలి విడుదల తర్వాత ప్రభాస్ స్థాయి ఏ రేంజిలో ఉంటుందో ఊహించుంటేనే మైండ్ బ్లాక్ అవుతోంది.
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'బాహుబలి' షూటింగ్ మూడో షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు రాణా, అనుష్క, రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమా కోసం ఫిల్మ్ సిటీలో కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ సెట్టింగులు వేసారు. అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వాస్తవికత ఉట్టిపడేలా ఈ సెట్ డిజైన్ చేసారు.
ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది.
ప్రభాస్ అఫీసియల్ ఫేస్‌బుక్ పేజి: www.facebook.com/ActorPrabhas
దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












