సెల్ టవర్ ఎక్కి ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్ బెదిరింపులు... ఇంత పిచ్చి అభిమానమా?

Recommended Video

Prabhas Fan Climbs The Cell Tower In Jangaon || రెబల్ స్టార్ రాకపోతే దూకేస్తానంటూ బెదిరింపు..!!

సినిమా వాళ్లు, క్రికెటర్లు, రాజకీయ నాయకులకు అభిమానులు ఉండటం సహజమే. అయితే అభిమానుల్లో డైహార్డ్ ఫ్యాన్స్ తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. అయితే వీరిని మించిన పిచ్చి అభిమానంతో ఓ వర్గం ఉంటుంది. వీరి వ్యవహారం కాస్త తేడాగా ఉంటుంది. తమ చర్యలతో సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి సంఘటనే తాజాగా తెలంగాణ ప్రాంతంలోని జనగామ జిల్లాలో చోటు చేసుకుంది.

ప్రభాస్ అభిమానిని అని చెప్పుకుంటున్న ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. 'సాహో' స్టార్ ప్రభాస్‌ను వెంటనే కలవాలని, అతడు ఇక్కడకు రావాలని, లేకుంటే ఇక్కడి నుంచి దూకి చనిపోతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

వీడియో వైరల్

వీడియో వైరల్

ప్రభాస్ నటించిన ‘సాహో' చిత్రం ఇటీవలే విడుదలైన నేపథ్యంలో ఆల్రెడీ ప్రభాస్ గురించిన టాపిక్స్, సాహో గురించిన విషయాలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్ అని ట్యాగ్ చేసి ఉన్న ఈ వీడియోలో ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో వేగంగా స్ప్రెడ్ అయింది.

ప్రభాస్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే

ప్రభాస్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే

ఈ వీడియోపై ప్రభాస్ అభిమానులు కొందరు స్పందిస్తూ... టవర్ ఎక్కిన వ్యక్తికి బహుషా మతిస్థిమితం సరిగా లేకపోవచ్చు, టవర్ ఎక్కి బెదిరించినంత మాత్రాన ఎక్కడో ఉన్న ప్రభాస్‌ను ఇక్కడకు తీసుకురావడం ఎలా సాధ్యం? ఇలాంటి పిచ్చి పనులను ఏ అభిమాని ఎంకరేజ్ చేయడు అని అంటున్నారు.

టవర్ ఎక్కిన వ్యక్తి ఎవరు?

టవర్ ఎక్కిన వ్యక్తి ఎవరు?

టవర్ ఎక్కిన వ్యక్తి మహబూబాబాద్‌ ప్రాంతానికి చెందిన వాడని తెలుస్తోంది. అయితే అతడు జనగామ జిల్లా యశ్వంత్‌పుర సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంక్‌ పక్కన ఉన్న టవర్ ఎక్కడం గమనార్హం. ఈ అభిమాని ఎందుకు ఇలా చేశాడు? కేవలం ప్రభాస్ మీద అభిమానమేనా? ఇంకేమైనా కారణాలున్నాయా? అనేది తెలియాల్సి ఉంది.

ప్రభాస్ ‘సాహో'

ప్రభాస్ ‘సాహో'

ప్రభాస్ నటించిన ‘సాహో' మూవీ విషయానికొస్తే... సుజీత్ దర్శకత్వంలో యూవి క్రియేషన్స్ వారు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 400 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వసూళ్లు బావున్నప్పటికీ బడ్జెట్ ఎక్కువగా ఉండటం వల్ల సినిమాకు లాభాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X