‘సాహో’ బేనర్ కడుతుండగా అపశృతి...
తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు. ఆగస్టు 30న యంగ్ రెబల్ స్టార్ నటించిన 'సాహో' మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో డై హార్డ్ ఫ్యాన్స్ తమ హీరో మూవీ విడుదలవుతున్న థియేటర్లను ప్లెక్సీలు, బేనర్లతో అలంకరిస్తున్నారు.
అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకుంటుండగా... విషాదం చోటు చేసుకుంది. ప్రభాస్ అభిమాని 'సాహో' థియేటర్ వద్ద బేనర్ కడుతూ విధ్యుత్ ఘాతానికి గురై క్రింద పడిపోయారు. మహబూబ్‌నగర్ తిరుమల థియేటర్ ఆవరణలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
వైరల్ అవుతున్న వీడియో
సదరు అభిమాని కరెంట్ షాక్‌కు గురై థియేటర్ మొదటి అంతస్తు నుంచి కింద పడిపోతున్న వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.

అజాగ్రత్తగా ఉంటే అంతే...
గతంలోనూ పలువురు ఫ్యాన్స్ తమ హీరో సినిమాల విడుదల సమయంలో బేనర్లు, ప్లెక్సీలు కడుతూ మరణించిన సందర్భాలు ఉన్నాయి. అవి కట్టే సమయంలో అజాగ్రత్తగా ఉండటం, ఎలాంటి సేఫ్టీ మెథడ్స్ పాటించక పోవడమే ఈ ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది.

అసలే వర్షాకాలం, పొంచి ఉన్న ప్రమాదం
అసలే ఇది వర్షా కాలం... విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే కాలం.. గతంలో పలువురు ఫ్యాన్స్ బేనర్లు కడుతూ మృత్యువాతకు గురైంది కూడా ఈ సీజన్లోనే. తాజాగా ఇలాంటిదే మరొక ప్రమాదం చోటు చేసుకోవడంతో ఫ్యాన్స్ అప్రమత్తం అయ్యారు.

సాహో
సాహో మూవీ విషయానికొస్తే.... సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ వారు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్యాన్ ఇండియా మూవీగా నాలుగు భాషల్లో విడుదలవుతున్న
ఈ చిత్రంలో ప్రభాస్, శ్రద్ధా కపూర్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, అరుణ్ విజయ్, ఎవలీన్ శర్మ, మందిరా బేడీ తదితరులు ముఖ్య పాతలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











