Salaar update కోసం సూసైడ్ లెటర్…ప్రశాంత్ నీల్ ను హెచ్చరిస్తూ ప్రభాస్ ఫ్యాన్ కలకలం

మన దేశంలోని సినీ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా, తీయడానికి అయినా సిద్ధం అనేలా వాళ్లు ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక్కోసారి అభిమానుల అత్యుత్సాహంతో హీరోలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు అలాగే మాటలు పడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. ఇప్పుడు ఏకంగా సినిమా అప్డేట్ కోసం చనిపోతాను అంటూ ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ లెటర్ పోస్ట్ చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇటీవల రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఆ సినిమాతో ఒక డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న ప్రభాస్ కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేయగా మరికొన్ని సినిమాలు షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్టు కే సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలై పలు షెడ్యూల్స్ షూటింగ్ కూడా జరుపుకుంది. ఇటీవల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ 2 సినిమా విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించడమే కాక అనేక సంచలన రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తో ఆయన చేయబోతున్న సలార్ సినిమా మీద అందరికీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని అప్డేట్ తప్ప మరే అప్డేట్ సినిమా నుంచి లేదు. నిజానికి సినిమా ప్రారంభించిన కొత్త లో ప్రభాస్ లుక్ ఒక దాన్ని విడుదల చేశారు. ఆ తర్వాత దాని గురించి ఎలాంటి ప్రస్తావన లేదు, ఇలా వదిలేస్తే ఇక అప్డేట్ రాదు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ప్రభాస్ అభిమాని ఒకరు ఏకంగా ప్రశాంత్ నీల్ కు మీరు కనుక సినిమా అప్డేట్ ఇవ్వకపోతే చనిపోతాను అంటూ సూసైడ్ లెటర్ రాయడం సంచలనంగా మారింది.

Prabhas fan wrote a suicide letter to Prashanth neel

ప్రశాంత్ నీల్ మే నెలలో సినిమా నుంచి గ్లింప్స్ ఒక దాన్ని విడుదల చేస్తానని చెప్పారు. కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ విడుదల కాలేదు. ప్రభాస్ అభిమానుల మైన మేము సాహో, రాధేశ్యామ్ వంటి సినిమాల ఫలితాలతో చాలా బాధపడుతున్నాము. ఆ సినిమాల సమయంలో కూడా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా అభిమానులను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అదే విషయం ఈ సినిమా విషయంలో కూడా రిపీట్ అవుతుందేమో అనే భయం నెలకొని ఉంది. మీరు ఈ లేఖన్ను సీరియస్గా తీసుకుని వీలైనంత త్వరగా అప్డేట్ విడుదల చేయండి, ఈ మే నెలలో ఎలాంటి అప్డేట్ రాకపోతే కచ్చితంగా నేను సూసైడ్ చేసుకుంటాను అంటూ లేఖలో పేర్కొన్నారు సదరు అభిమాని. ప్రస్తుతం ఈ లేక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం మీద సినిమా యూనిట్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X