ప్రభాస్ దర్శకుడిపై అభిమానుల పోలీస్ కంప్లైంట్.. మంచు మనోజ్ షాకింగ్ రియాక్షన్
అభిమానుల ప్రేమను తట్టుకోవడం ఎంత కష్టమో అలాగే వారి ఆగ్రహాన్ని తట్టుకోవడం కూడా అంతే కష్టం. ఇక ఈ రోజుల్లో హీరోల కెరీర్ ను చాలా పర్సనల్ గా తీసుకుంటున్న ఫ్యాన్స్ ఎంతో కష్టపడి సినిమాకు హైప్ వచ్చేలా ప్రమోషన్స్ చేస్తున్నారనే చెప్పాలి. చిన్న పోస్టర్ రిలీజ్ అయినా కూడా ట్రెండ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఇక రీసెంట్ గా ప్రభాస్ దర్శకుడిపై వారు చాలా ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ కామెంట్స్ కు మంచు మనోజ్ కూడా నవ్వేశాడు.

రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా
నిజంగా ప్రభాస్ అభిమానులు గత కొంతకాలంగా వారి హీరో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ పై ఏ మాత్రం సంతృప్తిగా లేరని తెలుస్తోంది. సాహో సినిమాకు ఎంత ఆలస్యం అయ్యిందో ఇప్పుడు రాధేశ్యామ్ కూడా అలానే అవుతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా కూడా పెద్దగా హైప్ క్రియేట్ చేసే కంటెంట్ ఏమి వదలడం లేదు. సినిమా జులై 30న రాబోతోంది.

అదే తరహాలో
యూవీ క్రియేషన్స్ పై అప్పట్లో ప్రభాస్ అభిమానులు బ్యాన్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో దండయాత్ర చేశారు. మరోసారి మా హీరోతో సినిమా చేయకండి అంటూ కామెంట్స్ చేశారు. ఇక ప్రస్తుతం రాధేశ్యామ్ విషయంలో అదే తరహాలో నెగిటివ్ కామెంట్స్ అందుకుంటున్నారు.

హీరోయిన్ పై నీతిన్ కంప్లైంట్
సినిమాకు సంబంధించిన చిన్న టీజర్ తప్పితే ఇప్పటివరకు అంచనల డోస్ ను పెంచేంత హైప్ అయితే క్రియేట్ చేయలేదు. ఇక ఇటీవల నితిన్ సరదాగా కీర్తి సురేష్ చిన్నప్పటి పోటో చూపించి ట్విట్టర్ లో పోలీస్ వాళ్ళు ఈ అమ్మాయిని వెతికి పట్టుకోవాలని చెప్పారు. రంగ్ దే సినిమా ప్రమోషన్ కు రావడం లేదని సరదాగా కామెంట్ చేశాడు. ఇక ఆ పోస్ట్ పై హైదరాబాద్ పోలీసులు కూడా సరదాగా రియాక్ట్ అయ్యారు.

రాధే శ్యామ్ దర్శకిడిపై కంప్లైంట్
పనిలో పనిగా రాదే శ్యామ్ దర్శకుడిని కూడా పట్టుకోవాలని ఓ వర్గం అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ కామెంట్ చూసి హీరో మంచు మనోజ్ పక్కున నవ్వేశారు. తోటి దర్శకులు పాన్ ఇండియా లెవెల్లో ఈజీగా ప్లాన్ చేస్తున్నారు. కానీ రాధేశ్యామ్ దర్శకుడు మాత్రం కనీసం సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం లేదు. దీంతో అభిమానులు ఆ విషయంలో అసంతృప్తి చెందుతూ ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు. మరి అభిమానుల రియాక్షన్ పై దర్శకుడు ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











